వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాబోయే 30 ఏళ్లు వైసీపీదే అధికారం అని, ఇకపై, జగన్ 2.0 చూస్తారని జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో, జగన్ డైలాగులకు లేటెస్ట్ ట్రెండింగ్ బీజీఎంలు ఇచ్చి భారీ ఎలివేషన్లతో వీడియోలను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. అయితే, వారి ఆనందాన్ని ఆవిరి చేస్తూ జగన్ గాలి తీసేలా మంత్రి లోకేశ్ ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. 2024 ఎన్నికల ముందు కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడని..కానీ, ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో అందరికీ తెలుసని లోకేశ్ సెటైర్లు వేశారు.
అంతేకాదు, ప్రజలు ఇంకా జగన్ 1.0 అరాచకం నుంచే కోలుకులేదని, అప్పుడే జగన్ 2.0 అని అంటున్నారని జగన్ కు లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేసుల గురించి జగన్ మాట్లాడుతున్నారని, కానీ, ఆయన హయాంలో దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలపై అక్రమ కేసులు బనాయించారని, కొందరిని చంపారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదని…ఇక్కడున్న టీడీపీ నేతలందరిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాను బయటకు రాకుండా గేట్లకు తాళ్లు కట్టారని, తనపై 23 కేసులు పెట్టారని అన్నారు. అందులో, హత్యాయత్నం కేసు ..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని.
శాశ్వత భూ హక్కు అంటూ ప్రజల భూములు కాజేసే ప్రయత్నం చేసశారని, ప్రజలు అవేమీ మరిచిపోలేదని చెప్పారు. ఇక, చట్టప్రకారం గత ప్రభుత్వం చేసిన స్కామ్ లపై చర్యలు తీసుకుంటామని, అది కక్ష సాధింపు కాదని అన్నారు. ఇక, జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తామేమీ చేయలేమని చురకలంటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి రావడం జగన్ బాధ్యత అని, కనీసం పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలని అన్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కలిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates