రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నవ శకానికి నాందీ పలికారు. నిన్నటిదాకా రాజకీయం అంటే… ఎన్నికలప్పుడే జనానికి నేతలు కనిపించే వారు. ఆ తర్వాత నేతలను వెతుక్కుంటూ జనం నానా పాట్లూ పడే వారు. ఆ పరిస్థితిని లోకేశ్ మార్చేశారు. తనను నమ్మిన జనానికి ఎంత చేసినా తక్కువేనని ఆయన భావించారు.
వారి బతుకులను అందలం ఎక్కించేందుకు ప్లాన్ రెడీ చేశారు. అధికారంలో ఉన్నది తన పార్టీ ప్రభుత్వమే అయినా… తన సొంత నిధులతో తన జనంలో వెలుగులు నింపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం నిజంగానే లోకేశ్ ను ఏ ఒక్క రాజకీయ నేతకు అందనంత ఎత్తులో నిలిపింది.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని లోకేశ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్లాన్ చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసిన లోకేశ్ ఓటమిపాలయ్యారు. అయినా లోకేశ్ బాధపడలేదు. తన జనం చేతిలోనే కదా ఓడిపోయింది అనుకున్నారు. ఆపై మంగళగిరిలోనే తిష్ట వేశారు. ఇంటింటికీ దగ్గరయ్యారు.
ఈ క్రమంలో అదేంటీ… ఎన్నికలు లేకున్నా…లోకేశ్ తమ దగ్గరకు వస్తున్నారు అనే చర్చ జనంలో మొదలైంది. అంతే… లోకేశ్ లోని అసలు గుణాన్ని మంగళగిరి జనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈలోగానే 2024 ఎన్నికలు రానే వచ్చాయి. తిరిగీ లోకేశ్ అక్కడే పోటీ చేశారు. గతంలో తప్పు చేశామని భావించిన మంగళగిరి జనం… ఈ దఫా లోకేశ్ ను రికార్డు మెజారిటీతో గెలిపించారు.
మంగళగిరి జనం తనను నమ్మారని గ్రహించిన లోకేశ్… వారి బాగు కోసం ఏదైనా చేయాలని తపించారు. ఇందులో భాగంగా అదిక జనాభాగా ఉన్న చేనేత కార్మికుల కోసం అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఏర్పాటు చేసి… దాని భవనానికి స్థలాన్ని, ఆర్థిక వనరులను సమకూర్చారు. తాజాగా స్వర్ణకారుల జీవితాలను బాగు చేయడానికి లోకేశ్ కంకణం కట్టుకున్నారు.
ఈ చర్య అటు స్వర్ణకారులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడంతో పాటుగా రాష్ట్రానికి సిరులు కురిపించే దిశగా ఓ అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందించే అవకాశం ఉన్నా…తొలుత తన సొంత నిధులతో ఈ ప్రణాళికను పట్టాలెక్కించాలని లోకేశ్ భావించారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రణాళికను అమలులో పెట్టేశారు.
ఈ నయా ప్రణాళికలో భాగంగా మంగళగిరిలో వరల్డ్ క్లాస్ స్వర్ణాభరణాల తయారీ హబ్ ను ఏర్పాటు చేయనున్నారు. అది అంతిమ లక్ష్యం కాగా… దానికి దన్నుగా నిలిచే స్వర్ణకారుల శిక్షణను లోకేశ్ తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు. గోల్డ్ హబ్ ఏర్పాటు కావడానికి ముందే స్వర్ణకారులను అంతర్జాతీయ స్థాయి వృత్తి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దేందుకు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ లో ఇప్పటికే 77 మంది సభ్యులుగా చేరారు.
ఈ ఫౌండేషన్ కు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, పడవల మహేశ్, మండవ హారికలతో డైరెక్టర్ల బోర్డును ఏర్పాటు చేశారు.ఈ ఫౌండేషన్ ద్వారా మంగళగిరిలోని 670 మంది స్వర్ణకారులకు ఉచితంగా శిక్షణ అందనుంది. అంతేకాకుండా శిక్షణ అనంతరం వీరికి ఆయా సంస్థల నుంచి వర్క్ ఆర్డర్లను ఇప్పించేందుకు కూడా ఫౌండేషన్ కృషి చేయనుంది. ఈ ఫౌండేషన్ వ్యవహారాలన్నీ లోకేశ్ సొంత నిధులతో నడవనున్నాయి.
This post was last modified on February 1, 2025 8:35 am
కొత్త ఏడాదిలో రెండో నెల వచ్చేసింది. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సౌండ్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…
అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…
భారత్ మరోసారి టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో…