వరస ఫ్లాపులతో సతమవుతున్నప్పుడు యూత్ హీరో కిరణ్ అబ్బవరంకు ‘క’ ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక్కసారిగా మార్కెట్ ని నిలబెట్టింది. నిర్మాణంలో ఉన్న సినిమాలు వేగమందుకోవడంతో పాటు కొత్త ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం రెమ్యూనరేషన్ అయిదు కోట్ల దాకా పలుకుతోందని ఇండస్ట్రీ టాక్ ఉంది. అదెంత వరకు నిజమో కానీ కుర్రాడికి డిమాండ్ పెరిగిన మాట నిజమే.
తన కొత్త సినిమా దిల్ రుబా ఫిబ్రవరి 14 విడుదలకు రెడీ అవుతోంది. దానికి అనుగుణంగా ప్రమోషన్లలో డేట్ వేసుకుంటూ వచ్చారు. లిరికల్ వీడియోలోనూ అదే ఉంది. కానీ తాజా పరిణామాలు మనసు మార్చుకునేలా చేస్తున్నాయని సమాచారం.
చేతిలో ఉన్నది పదమూడు రోజులు. ఇంత తక్కువ గ్యాప్ లో పబ్లిసిటీతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్, బాలన్స్ పాటల రిలీజ్ పూర్తి చేయాలి. బయట కార్యక్రమాల్లో పాల్గొనాలి. బజ్ వచ్చేందుకు ఏదైనా వెరైటీగా డిజైన్ చేయాలి. పైగా వారం ముందు వస్తున్న తండేల్ కు కనక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం రెండు వారాలు దాని దూకుడు ఉంటుంది.
తట్టుకోవడం అంత సులభం కాదు. పుష్ప 2 ది రూల్ సునామిలో చాలా సినిమాలు ఈ సమస్యను ఎదురుకుని కలెక్షన్లు రాబట్టుకోలేకపోయాయి. అందుకే తండేల్ గురించి సీరియస్ ఆలోచన చేస్తునట్టు తెలిసింది. దానికి తోడు విశ్వక్ సేన్ లైలా కూడా అదే రోజు వాయిదా లేకుండా దిగుతోంది.
ఈ పరిణామాలన్నీ చూస్తే దిల్ రుబా వాయిదా పడటం ఖాయమని ఇన్ సైడ్ న్యూస్. ఫిబ్రవరి చివరి వారంని నెక్స్ట్ ఆప్షన్ గా చూస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళో రేపో రావొచ్చు. ఒకవేళ అదే ఫిబ్రవరి 14 డేట్ కి కట్టుబడితే మాత్రం ప్రచారాన్ని స్పీడప్ చేయాలి.
విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన దిల్ రుబాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించింది. క, పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి పేరు తెచ్చుకున్న సామ్ సిఎస్ మ్యూజిక్ మరోసారి పెద్ద ప్లస్ అవుతుందని కిరణ్ నమ్మకంగా ఉన్నాడు. ఆవేశంతో ఊగిపోయే కాలేజీ కుర్రాడిగా తన పాత్ర కాస్త డిఫరెంట్ గానే ఉంటుందట. చూడాలి.
This post was last modified on February 1, 2025 8:47 am
రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…
మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…
నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట…
నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…
జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…