వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించారు. గురువారం రాత్రి లండన్ లో ఫ్లైట్ ఎక్కిన జగన్ దంపతులు… శుక్రవారం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. దాదాపుగా 15 రోజులకు పైగా లండన్ లో సేదదీరిన జగన్… నిర్దేశిత గడువులోగానే తన పర్యటనను ముగించారు. ప్రస్తుతం బెంగళూరు చేరిన జగన్… విదేశీ ప్రయాణం బడలికను తీర్చుకుని ఫిబ్రవరి 3న నింపాదిగా తాడేపల్లి చేరుకుంటారట.
లండన్ లో చదువుతున్న తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లిన జగన్.. లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేశారు. ప్రారంభంలో అంతగా ఫోకస్ లేకుండానే లండన్ వీధుల్లో సంచరించిన జగన్…ఆ తర్వాత తన ఫొటోలు సోషల్ మీడియాలోకి ఎక్కేలా నడుచుకున్నారు. రోజుకో కొత్త లుక్కులో కనిపించిన జగన్… ఫ్యాషన్ దుస్తులపై తనకు ఎంతగా ఇష్టముందన్న విషయాన్ని బయటపెట్టుకున్నారు. లండన్ లో ఉండగా…తన రెగ్యులర్ డ్రెస్ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు.
అదేంటో గానీ…జగన్ తో పాటు జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా విదేశాలకు వెళితే.. తమ రెగ్యులర్ డ్రెస్సింగ్ ను పక్కనపెట్టేస్తారు. ఎంచక్కా తమకు ఇష్టమైన సరికొత్త ఫ్యాషన్ దుస్తుల్లోకి ఒరిగిపోయి తమలో దాగి ఉన్న ఫ్యాషన్ దాహార్తి తీర్చుకుంటారు. అయితే విదేశీ పర్యటనలు ముగించుకుని దేశానికి తిరిగి వచ్చారంటే… క్షణం ఆలస్యం చేయకుండా వారు తిరిగి తమ రెగ్యులర్ యూనిఫాంలలోకి మారిపోతారు.
ఇప్పుడు జగన్ కూడా అదే మాదిరిగా లండన్ వీడి బెంగళూరు చేరినంతనే తన రెగ్యులర్ డ్రెస్ కోడ్ అయిన తెలుపు చొక్కా, ఖాకీ ప్యాంటులోకి మారిపోయారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయాన్ని చెప్పుకోవాలి. గురువారం రాత్రి లండన్ లో విమానం ఎక్కే సందర్భంగా జగన్ జీన్స్, బ్లేజర్ లో సందడి చేశారు. తనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారితో ఫొటోలు తీసుకున్నారు. అయితే బెంగళూరులో నేటి ఉదయం విమానం దిగిన ఆయన తన రెగ్యులర్ డ్రెస్ కోడ్ లో బయటకు వచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates