టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నారంటే… అన్ని కొత్త కొత్త అంశాలపైనే చర్చ సాగుతుంది. నిత్యం నూతన పాలనా విధానాలను ప్రజలకు అందిస్తూ సాగుతున్న చంద్రబాబు… తాజాగా ఏపీ ప్రజలకు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ పేరిట సరికొత్త తరహాలో సేవలు అందించనున్నారు.
ఈ చర్యతో ఏపీని ఆయన దేశంలోనే తొలి స్థానంలో నిలపన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ రాష్ట్ర పాలనలోఓ గేమ్ ఛేంజర్ అనే చెప్పక తప్పదు. బుధవారం పలు శాఖలకు చెందిన అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు… వాట్సాప్ గవర్నెన్స్ ను గురువారం నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.
రేపు (గురువారం) రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా వాట్సాప్ గవర్నెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కొత్త విధానంలో వాట్పాస్ ద్వారా 161 సర్వీసులను ప్రజలకు అందించనున్నారు.
ఇందుకోసం ప్రభుత్వం ఓ వాట్సాప్ నెంబర్ ను ప్రకటించనుంది. ఈ నెంబర్ కు ప్రజలు వినతులు పంపితే…ప్రభుత్వం నుంచి ఆయా సేవల వివరాలు, సర్టిఫికెట్లు అదే వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రజలకు అందనున్నాయి.
ఈ నూతన పాలనా విధానం కోసం ఇదివరకే వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి దశలో 161 సేవలు మాత్రమే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందనున్నా… మలి దశలో మరిన్ని సేవలను ఈ విధానం ద్వారా అందించనున్నారు.
తొలి దశ సేవల్లో భాగంగా ఆయా శాఖల సేవలతో పాటుగా పలు శాఖలకు చెందిన బిల్లుల చెల్లింపును కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెల్లించే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates