తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా కాకముందే… రెండు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు రాజకీయంగా రంజుగా సాగుతోంది. ఫలితంగా శాసన మండలి ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా మరింత వేడిని రాజేయనుంది.
ఇక ఎన్నికలు జరగనున్న స్థానాల విషయానికి వస్తే…ఏపీలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) స్థానాలతో పాటుగా ఓ ఉపాధ్యాయ (టీచర్) ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక తెలంగాణలో రెండు టీచర్ స్థానాలతో పాటుగా ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో మూడేసి శాసన మండలి స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 3న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే నెల 27న ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమమైన పోలింగ్ జరగనుండగా… మార్చి 3న ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే… రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవలే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.

Gulte Telugu Telugu Political and Movie News Updates