పోలవరం ప్రాజెక్టు… ఎవరు ఔనన్నా, కాదన్నా…ఏపీకి జీవనాడే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సత్యాన్ని గ్రహించిన నేత పవర్ లో ఉంటే… పోలవరం పనులు ఎలా సాగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు అచ్చు గుద్దినట్టు అలాగే పరుగులు పెడుతున్నాయి. 50 ఏళ్ల తర్వాతి పరిస్థితులను కూడా అంచనా వేయగలిగిన విజనరీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా.. పోలవరం పనులు మందకోడిగా జరుగుతాయని ఎలా అనుకుంటాం?
నిజమే.. తనదైన శైలి విజన్ తో అద్భుతాలు సృష్టిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ పోలవరం పనులను పరుగులు పెట్టిస్తోంది. 7 నెలల క్రితం రెండోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు… వచ్చీరాగానే పోలవరం పనులపై దృష్టి సారించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం పోలవరంలో చేసిన విధ్వంస రచనను కూడా అంచనా వేసిన చంద్రబాబు ఈ దఫా అలాంటి ముప్పు పోలవరానికి ఎదురు కాకూడదని తీర్మానించుకున్నారు. ఆ దిశగానే పకడ్బందీగా ప్రణాళికలు రచించారు. ఈ ప్రాణాళికలను నిర్దేశిత సమయంలోగానే అమలులోకి తీసుకువచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి మాసంలో పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ పనులను చేపడతామని గతంలో ప్రకటించిన చంద్రబాబు.. ఆ మాట మేరకే జనవరిలోనే డయాఫ్రం వాల్ పనులను మొదలు పెట్టించారు. ప్రస్తుతం డయాఫ్రం వాల్ పనులు అక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. డయాఫ్రం వాల్ నిర్మాణం నిర్ణీత దశ వరకు పూర్తి కాగానే… దానికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేపట్టాలని కూడా చంద్రబాబు ఇదివరకే నిర్ణయించారు. ఆ మాట మేరకే ఇప్పుడు డయాఫ్రం వాల్ నిర్మాణం నిర్దేశిత దశకు చేరువలో ఉన్నట్లు సమాచారం. ఈ దశకు డయాఫ్రం వాల్ రాగానే… వెనువెంటనే దానికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates