Political News

చంద్రబాబు… ‘బ్రాండ్ ఏపీ’కి బ్రాండ్

స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ ఏపీ నినాదంతో వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర అధికారుల బృందం ఏకంగా నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించింది. దావోస్ తో పాటు జూరిక్ లోనూ పలు సమావేశాలు ఏర్పాటు చేసిన చంద్రబాబు బృందం ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. తాము అనుకున్న లక్ష్యాన్ని దిగ్విజయంగానే పూర్తి చేసింది.

అయితే దావోస్ లో ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే చంద్రబాబు బృందం మాత్రం సింగిల్ పైసా పెట్టుబడులు తీసుకురాలేకపోయిందని విపక్షం వైసీపీ విమర్శించింది. అయితే తాము దావోస్ కు వెళ్లింది ఒప్పందాలు చేసుకోవడానికి కాదని…ఏపీలో పెట్టుబడులకు ఉన్నఅవకాశాలను ఆయా దేశాలు, కంపెనీలకు తెలియజేయడానికేనని చంద్రబాబు అండ్ కో ఆ విమర్శలను సమర్థంగానే తిప్పికొట్టింది. అంతేకాకుండా దావోస్ అంటే పెట్టుబడుల ఒప్పందాలు జరిగే ప్రదేశమనే భావన తప్పని… పెట్టుబడులకు గల అవకాశాలపై అన్వేషణ జరిగే ప్రదేశంగా దానిని భావించాలని తెలిపింది.

దావోస్ లో ఏం జరిగిందన్న దానిపై తాజాగా టీడీపీ యువనేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజాగా వివరించే యత్నం చేశారు. దావోస్ లో మహారాష్ట్ర, తెలంగాణలకు పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. వాటిలో మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా నిలిచిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఏపీకి దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే… గడచిన 7 నెలల్లోనే ఏకంగా రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మహారాష్ట్ర, తెలంగాణలు పెట్టుబడుల కోసం దావోస్ దాకా వెళ్లాల్సి వచ్చిందని రామ్మోహన్ పేర్కొన్నారు. అయితే ఏపీ ఎక్కడికీ వెళ్లకుండానే.. ఆ రాష్ట్రాలకు దావోస్ లో వచ్చిన పెట్టుబడుల కంటే అధిక శాతం పెట్టుబడులను రాబట్టుకోగలిగిందని తెలిపారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబేనన్న కేంద్ర మంత్రి… ఏపీకి బ్రాండ్ చంద్రబాబేనని తెలిపారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లు బ్రాండ్ లుగా కొనసాగుతుంటే…ఏపీకి మాత్రం చంద్రబాబు బ్రాండ్ గా నిలుస్తున్నారని, అందుకే పెట్టుబడులు ఏపీకి నడుచుకుంటూ వస్తున్నాయని ఆయన తెలిపారు. అయినా దావోస్ కు వెళ్లడం, అక్కడికి వచ్చే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు తమ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించడం కూడా ముఖ్యమని చంద్రబాబు భావించారని, అందుకే దావోస్ టూర్ కు వెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు.

This post was last modified on January 28, 2025 9:49 am

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

3 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

6 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

8 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

9 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

9 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

10 hours ago