సందీప్ రెడ్డి వంగ సినిమాలకు, అనిల్ రావిపూడి తీసే చిత్రాలకు అస్సలు పొంతన ఉండదు. కానీ సందీప్ అంటే అనిల్‌కు ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే సందీప్ నుంచి రానున్న కొత్త చిత్రం ‘స్పిరిట్’లో నటుడిగా ఛాన్స్ ఇవ్వమని అడిగాడట అనిల్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అనిల్. ఐతే దానికి సందీప్ ఏం బదులిచ్చాడో కూడా అతను వెల్లడించాడు.
నువ్వు సినిమా తర్వాత సినిమా తీస్తూ ఖాళీయే లేకుండా దూసుకుపోతుంటావు.. మరి నా సినిమాలో నటించేంత ఖాళీ నీకు ఉందా అని అన్నాడట సందీప్. ఆ సంభాషణ తర్వాత తాను ఏమన్నది మాత్రం అనిల్ వెల్లడించలేదు. తమ ఇద్దరి దర్శకత్వ శైలి గురించి అనిల్ మాట్లాడుతూ.. తాను ఇంకో పదేళ్ల ప్రయత్నం చేసినా సందీప్ లాగా సినిమాలు తీయలేనని అతను స్పష్టం చేశాడు. అదే సమయంలో సందీప్ కూడా తన స్టైల్లో సినిమాలు తీయలేదన్నాడు.
ఎవరి శైలి వారిదని అతను వ్యాఖ్యానించాడు. ‘యానిమల్’ సినిమా చూసి తెగ ఇంప్రెస్ అయిన అనిల్.. అందులో ఓ ప్రత్యేక పాత్ర చేసిన మరాఠీ నటుడు ఉపేంద్ర లిమాయేను తీసుకొచ్చి.. తన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటింపజేశాడు. సీరియస్ ఇమేజ్ ఉన్న ఉపేంద్ర.. ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసి ప్రేక్షకులను బాగానే నవ్వించాడు.
అనిల్ సరదాకే సందీప్ సినిమాలో వేషం అడిగి ఉండొచ్చేమో కానీ.. తన లుక్స్, తన సినిమా ప్రమోషన్ల కోసం అతను చేసే వీడియోలు అవీ చూస్తే.. నటుడిగా రాణించగలడనే అనిపిస్తుంది. భవిష్యత్తులో అతను ఏదో ఒక సినిమాలో నటుడిగా అరంగేట్రం చేస్తే ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అనిల్.. త్వరలోనే చిరంజీవి సినిమా పనులు మొదలుపెట్టబోతున్నాడు.
This post was last modified on January 28, 2025 8:28 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…