తమిళనాట గడచిన రెండు రోజులుగా ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ వార్తపైనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఫలితంగా చోటామోటా వెబ్ సైట్లను దాటేసిన ఈ వార్త ఇప్పుడు మెయిన్ మీడియాకూ ఎక్కేసింది. ఫలితంగా సోమవారం తమిళనాడు వ్యాప్తంగా ఈ వార్తే టాప్ ట్రెండింగ్ లో నడిచింది. మరింత కాలం పాటు ఈ వార్త ట్రెండింగ్ లోనే కొనసాగడం ఖాయమన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అసలు విషయం చెప్పకుండా… ఈ ఇంట్రడక్షన్ ఏమిటీ? అంటారా… అయితే అసలు స్టోరీలోకి వెళ్లిపోదాం పదండి. శ్రీలంకలో తమిళవాసులు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని గతంలో పెద్ద ఉద్యమమే జరిగింది కదా. ఇందుకోసం లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్స్ ఈలం (ఎల్టీటీఈ) పేరిట దశాబ్దాల పాటు ఓ యుద్ధమే జరిగింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ లో ఆమె ఎల్టీటీఈ యాక్టివస్ట్ గానే కనిపించి… ఆ సంస్థ ఎంతటి డేంజర్ సంస్థో చెప్పేసింది. ఆ సంస్థను వేలెపిళ్లై ప్రభాకరన్ అనే వ్యక్తి స్థాపించాడు. అంతా ఇతడిని టైగర్ అని ముద్దుగా పిలుచుకునేవారు.
మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసింది కూడా ఈ సంస్థనే. తర్వాత కాలంలో శ్రీలంక సర్కారు ఎల్టీటీఈని చక్రబంధంలో ఇరికించేసి దాని సైన్యంతో పాటుగా చీఫ్ ప్రభాకరన్ ను కూడా హతమార్చింది. 2009 ,మే 18న ప్రభాకరన్ ను చంపేశామంటూ శ్రీలంక సైన్యం ప్రకటించింది. ప్రపంచం కూడా నమ్మేసింది. అప్పటినుంచి ఆయన ప్రస్తావనే రావట్లేదు. అయితే ఇప్పటికీ సింహళ భూభాగంలో తమిళ రాజ్య స్థాపనపై ఇంకా ఆశలు చావని తమిళులు తమ టైగర్ అసలు చనిపోనే లేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని అప్పుడప్పుడూ చెబుతూ వస్తున్నారు. తమిళనాడులో ఎల్టీటీఈకి మద్దతు పలికే పార్టీలు కూడా అడపాదడపా ఈ ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి.
ఇలాంటి క్రమంతో సోమవారం తమిళనాట ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని, ఈ మే నెలలో ఆయన ప్రజల ముందుకు రానున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. శ్రీలంక అధికారిక ప్రకటన ప్రకారం… ప్రభాకరన్ చనిపోయి ఇప్పటికి దాదాపుగా 15 ఏళ్లు దాటిపోతోంది. అయినా కూడా ఎల్టీటీఈ అనుకూలురు మాత్రం ప్రభాకరన్ చనిపోలేదనే చెబుతున్నారు. మే నెలలో ప్రభాకరన్ తన ప్రధాన అనుచరుడు పొట్టు అమ్మన్ తో కలిసి ప్రజల ముందుకు రానున్నారని ఆ వార్తలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా పలు దేశాల్లో బలమైన నెట్ వర్క్ ఎల్టీటీఈ సొంతం. ఈ నేపథ్యంలో ప్రబాకరన్ ఇప్పటికీ సజీవంగానే ఉన్నా ఆశ్చర్యం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 28, 2025 9:57 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…