టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించాయి. బర్త్ డే నాడు లోకేశ్ దావోస్ లో ఉండిపోయిన నేపథ్యంలో ఆయనకు విషెస్ చెబుతూ చాలా మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, టీడీపీ శ్రేణులు సోసల్ మీడియా వేదికగా ఆయనకు గ్రీటింగ్స్ చెబుతూ సాగాయి. ఇక టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన సాగిస్తున్న ఏపీలో అయితే ఎక్కడికక్కడ లోకేశ్ బర్త్ డే వేడుకలు హోరెత్తాయి.
ఈ వేడుకల్లో భాగంగా… కొందరు టీడీపీ కార్యకర్తలు తాడేపల్లిలో నడిరోడ్డుపై కార్లు, బైకులతో వచ్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే… ఈ వేడుకలు జరిగింది మరెక్కడో కాదు… తాడేపల్లిలోని వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు ఈ వేడుకలు జరిగాయి. టీడీపీ శ్రేణులు కావాలనే జగన్ ఇంటి వద్ద ఈ వేడుకలను నిర్వహించాయన్న ఆరోపణలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం లోకేల్ విదేశీ పర్యటనకు వెళ్లారు. సరిగ్గా బర్త్ డే నాడు కూడా ఆయన దావోస్ లోనే పారిశ్రామికవేత్తలతో సమావేశాల కారణంగా బిజిబిజీగా గడిపారు. అదే సమయంలో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ సెరిమనీకి హాజరయ్యేందుకు జగన్ కూడా లండన్ వెళ్లారు. లోకేశ్ కంటే ముందే జగన్ విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నెలాఖరుకు గానీ ఆయన తిరిగి రారు. అంటే… అటు బర్త్ డే జరుపుకుంటున్న లోకేశ్ గానీ, ఇటు ఆయన రాజకీయ ప్రత్యర్థి జగన్ గానీ.. అందుబాటులో లేని సమయంలో టీడీపీ శ్రేణులు జగన్ ఇంటి వద్ద లోకేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరపడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates