టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు… అది కూడా తెలుగు వారు అయిన సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లు నేతృత్వం వహిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ఐటీ సంస్థల్లో కనీసం ఒక్క తెలుగు టెకీ అయినా తప్పనిసరిగా ఉంటున్నారన్నది అతిశయోక్తి అయితే కాదు. ఎక్కడికెళ్లినా… తెలుగు ప్రజలు సత్తా చాటుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. తెలుగువారు ఇప్పుడు సత్తా చాటడానికి గల కారణాలు ఏమిటన్న దానిపైనా ఆయన తనదైన శలి విజన్ ను ఆవిష్కరిస్తూ ఉంటారు.
తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునే నిమిత్తం దావోస్ వెళ్లిన చంద్రబాబు… సదస్సులో రెండో రోజైన మంగళవారం గ్రీన్ ఎనర్జీపై జరిగిన సమావేశంలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఏపీలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వేదికపై ప్రస్తావించిన చంద్రబాబు… భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదేనని చెప్పారు. గ్రీన్ ఎనర్జీకి ఏపీ కేంద్రంగా మారుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు నేల ఎప్పుడైనా నూతన ఆవిష్కరణలకు స్వాగతం పలుకుతుందని తెలిపారు. అందులో భాగంగా 25 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలను చంద్రబాబు వివరించారు.
1990లో భారత్ లో ఆర్థిక సంస్కరణలకు బీజం పడగా… అదే సమయంలో బిల్ గేట్స్ ఇంటర్నెట్ ను కనిపెట్టారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన సదరు ఇంటర్నెట్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దిశగా ఆలోచన చేసిన తాను…బిల్ గేట్స్ సహకారంతోనే ఆధునిక సాంకేతికతను ఏపీలోకి ఆహ్వానించానన్నారు. నాడు తన ఆసక్తిని గమనించిన బిల్ గేట్స్ తన సంస్థకు చెందిన మైక్రోసాఫ్ట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఈ కేంద్రం భారత ఐటీ రంగానికి… ప్రత్యేకించి హైదరాబాద్ ఈ మేర అభివృద్ధి సాధించడానికి కీలక అడుగు పడేలా చేసిందన్నారు. నాడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు రావడంతోనే నేడు సత్య నాదెళ్ల ఆ సంస్థకు సీఈఓ కాగలిగారన్నారు. ఓ విజన్ తో నాడు ముందుకు వెళ్లిన కారణంగానే… నేడు తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచం సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు. అలాంటి నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలంటే… సుస్థిర ప్రభుత్వాలు ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ విషయంలో భారత్ ఇతర అన్ని దేశాల కంటే కూడామెరుగైన పరిస్థితిలో ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ స్పష్టమైన విజన్ తో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఎప్పుడు ఏ నిర్ణయాన్ని తీసుకోవాలన్న అవగాహన కూడా మోదీకి ఉందన్నారు. మోదీ లాంటి విజన్ ఉన్న నేత.. భారత్ కు పాలకుడిగా ఉండటం మనం చేసుకున్న అదృష్టమన్నారు. మోదీ మార్గదర్శకత్వంలో బారత్ మంచి పురోభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ వృద్ధిలో తెలుగు వారు కూడా కీలక బూమిక పోషించడం ఖాయమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on January 21, 2025 6:39 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…