వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ సెరిమనీ కోసం వెళ్లిన జగన్.. ఈ నెలాఖరు దాకా అక్కడే ఉండేలా టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే జగన్ కుమార్తె గ్రాడ్యుయేషన్ పూర్తి కాగా… ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి జగన్ విహార యాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో జగన్ ఎంజాయ్ చేస్తున్న రెండు వీడియోలు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి వైరల్ గా మారిపోయాయి.
ఓ వీడియోలో భార్య బారతీ రెడ్డితో కలిసి జగన్ ఓ షాపింగ్ మాల్ లో కనిపించారు. వీరి వెంట వారి కుమార్తెలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. షాపింగ్ మాల్ లో భారతీ రెడ్డి ఏదో కొనుగోలు చేస్తూ ఉంటే… జగన్ ఆసక్తిగా తిలకిస్తూ కనిపించారు. ఇక రెండో వీడియోలో లండన్ లోని ఓ స్ట్రీట్ లో నిలబడిన జగన్… తన వారి కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. వారిని తన వద్దకు రమ్మని పిలుస్తూ జగన్ కనిపించారు. అదే సమయంలో తనకు సమీపంలో కనిపిస్తున్న షాప్ వద్దకు వెళ్లే క్రమంలో చిన్నగా నడుస్తూ కనిపించారు.
ఇదిలా ఉంటే…ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కోర్టు అనుమతితోనే లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. సతీసమేతంగా లండన్ వెళ్లిన వెంటనే కూతురి గ్రాడ్యుయేషన్ సెరీమనీని ముగించుకున్న జగన్… తన కుమార్తెలతో కలిసి గ్రూఫ్ ఫొటోను జగన్ పోస్ట్ చేశారు. కష్టపడి చదివి తనకు గర్వకారణంగా నిలిచావంటూ కూతురిని మెచ్చుకుంటూ జగన్ చేసిన సదరు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా పోస్టుల్లో జగన్ స్టైల్ ను చూసి జగన్ అభిమానులు ఆయనను హీరోగా అభివర్ణిస్తూ ఆసక్తికర కామెంట్లు పోస్టు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates