సంక్రాతి పండక్కి కొత్త అల్లుళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు అందుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ఏపీ ప్రజలు సిసలైన అల్లుళ్లుగా మారిపోయారు. అల్లుళ్లను అపురూపంగా చూసుకునే మామ మాదిరిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. పండగ వేడుకలు ముగిసిన మూడు రోజులకు అందుబాటులోకి రానున్న ఈ గిఫ్టుతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు ఓ రేంజిలో మారిపోతాయని చెప్పొచ్చు.
ఈ నెల 18… అంటే ఎల్లుండి నుంచి ఏపీ లో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనను ఆయన సంక్రాతి వేడుకల సందర్బంగా… తన సొంతూరు నారావారిపల్లెలో చేయడం గమనార్హం. ఈ పథకం కింద ప్రజలకు సేవలన్నీ వాట్సాప్ ద్వారానే లభించనున్నాయి. అంటే… కుల, ఆదాయ ధ్రువీకరణ పాత్రల కోసం ఇకపై ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. వాట్సాప్ ద్వారా అప్లై చేస్తే… క్షణాల్లో అదే వాట్సాప్ ద్వారానే ఆ పత్రాలు అందుతాయి.
ఇలా ఒకటి, రెండు కాదు… ఏకంగా 150కి పైగా సేవలను ప్రజలు వాట్సాప్ ద్వారా పొందనున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే… ఐటీ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ కి ప్రతిపాదించగా… మెటా అందుకు ఒప్పుకుంది. ఏపీ ప్రభుత్వంతో మెటా ఒప్పందం కుదుర్చుకోగా,,, సేవల బదిలీకి తాజాగా రంగం సిద్ధం అయింది. లోకేష్ ద్వారా దీనిపై సమాచారం తెలుసుకున్న చంద్రబాబు సంక్రాతి కానుకగా ఈ సేవలపై ప్రకటన చేసారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates