ఫార్ములా ఈ కార్ రేసులు కేసులో గురువారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మ్బత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు. విచారణ కోసం ఇంటి నుంచి బయలుదేరడానికి ఓ గంట ముందు కేటీఆర్ ఓ లెంగ్తీ ట్వీట్ ను పోస్ట్ చేసారు. అందులో కేటీఆర్ ఈ కేసు గుంరించిన వివరాలనే ప్రస్తావించడం గమనార్హం.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలన్న తాపత్రయంతోనే ఫార్ములా రేసులకు ప్లాన్ చేసామన్న కేటీఆర్.. అందులో సింగల్ పైసా అవినీతి కూడా జరగలేదన్నారు. ఫార్ములా రేసుల సంస్థకు చెల్లించిన సొమ్ము మొత్తం బ్యాంకు ద్వారానే పంపిన విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. బ్యాంకుల ద్వారా సొమ్ములు పంపితే కూడా అవినీతి జరుగుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంత పారదర్శకంగా నిధులు పంపితే మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందని కూడా ఆయన ప్రశ్నించారు.
ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకున్న రేవంత్ రెడ్డి సర్కారు కావాలనే తమను ఇరికిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా.. చట్టానికి లోబడి విరిచారణ సంస్థలకు సహకరిస్తామని ఆయన చెప్పారు. నిలకడ మీద అయినా నిజం బయటకి వస్తుందని తెలిపారు. హైదరాబాద్ బాగు కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనక్కు తగ్గేదే లేదని కేటీఆర్ చెప్పారు. ఈ ట్వీట్ చేసిన గంటకు కేటీఆర్ నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.