పవన్ ను టచ్ చేయడం అసాధ్యం!

నటుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను ఎన్నింటినో సాధించారు. ఇప్పుడు అటు సినిమాలతో పాటుగా ఇటు రాజకీయాల్లోనూ ఆయన తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఏ రాజకీయ నేతకు అయినా… తన పరిధిలో, తన హయాంలో జరిగే అభివృద్ధే సదరు నేత పనితీరుకు కొలమానం.

అది ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు…లేదంటే మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో కావచ్చు… పరిధి మారుతుందే గానీ.. వారి పరిధిలో, వారి హయాంలో జరిగిన అభివృద్ధే వారి పనితీరుకు గీటురాయి. ఈ కొలమానాలను ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్ బాగానే వంటబట్టించుకున్నారని చెప్పాలి.

పదవి చేపట్టి ఆరు నెలలే అవుతున్నా… తన పనితీరును తనకు తానుగా కొలుచుకుంటున్న పవన్ అభివృద్ధిలో దూసుకుపోతుకున్నారు. గతం విషయాన్ని వదిలేస్తే… భవిష్యత్తులో కనీసం తనను టచ్ చేసే నేతన్నమాటే లేకుండా ఆ అభివృద్ధిని ఆయన పరుగులు పెట్టిస్తున్నారు.

ఈ ఆరు నెలల్లోనే ఓ రేంజి ప్రోగ్రెస్ సాధించిన పవన్… రానున్న నాలుగున్నరేళ్లలో ఇదే జోరు కొనసాగిస్తే..ఆయన అనుకున్నట్లుగా పవన్ దరిదాపులకు వచ్చే నేత కూడా ఎవరూ ఉండచని చెప్పొచ్చు. వెరసి పవన్ ను టచ్ చేసే నేత రాబోరని ఘంటాపథంగా చెప్పవచ్చు.

అయినా ఈ ఆరు నెలల కాలంలో పవన్ ఏం చేశారన్న విషయానికి వస్తే… డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటుగా అటవీ, పర్యావరణ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. వీటిలో పల్లె ప్రగతిని బాగా ఫోకస్ చేసిన పవన్… గ్రామాలను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

ఈ ఆరు నెలల్లోనే గ్రామాల్లో 3,750 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లను వేయించిన పవన్… 22,500 మినీ గోకులాలను ఏర్పాటు చేయించారు. ఇక దుర్భర జీవనం సాగిస్తున్న గిరిజనుల ఉన్నతి కోసం ఈ ఆరు నెలల్లోనే పవన్ శాఖ ఏకంగా రూ.750 కోట్లను ఖర్చు చేయగలిగింది.

ఈ గణాంకాలను వైసీపీ హయాంలోని ఐధేళ్ల కాలంతో పవన్ పోల్చి చూపుతున్నారు. వైసీపీ పాలనలో సాంతం ఐదేళ్ల కాలంలో 1,800కిలో మీటర్ల మేర మాత్రమే సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి. ఇక మినీ గోకులాలను అసలు వైసీపీ పట్టించుకోలేదనే చెప్పాలి. ఐదేళ్లలో వైసీపీ కేవలం 268 మినీ గోకులాలను మాత్రమే ఏర్పాటు చేయగలిగింది.

ఇక గిరిజనుల ఉన్నతి కోసం ఐదేళ్ల కాలంలో వైసీపీ సర్కారు కేవలం రూ.91 కోట్లను మాత్రమే ఖచ్చు చేయగలిగింది. ఈ లెక్కన కేవలం ఆరు నెలల వ్యవధిలోనే వైసీపీ ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కంటే వందలు, వేల రెట్ల మేర వృద్ధిని పవన్ సాధించగలిగారు. ఇక మిగిలిన నాలుగున్నరేళ్ల కాలంలో ఇదే స్పీడు కొనసాగుతుందని చెప్పక తప్పదు. అంటే… ఫ్యూచర్ లో పవన్ ను టచ్ చేయడం కనీసం ఊహకు కూడా అందదని చెప్పొచ్చు.