ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా ఆమె ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయని పక్షంలో ప్రధాని నరేంద్రమ మోదీ ఆయనను తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె కోరారు.
కాంగ్రెస్ మినహా పార్లమెుంటులోని దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించడానికే భయపడిపోయారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని అధికార కూటమిలోని టీడీపీ, జనసేనలు సైతం అమిత్ షా వ్యాఖ్యలను ఖండించే సాహసం చేయలేకపోయాయని ఆమె అన్నారు. ఏపీలో దళితులు, బీసీలతో ఓట్లు వేయించుకున్న టీడీపీ, జనసేనలు ఆ వర్గాలకు ఆశాదీపమైన అంబేద్కర్ ను అవమానిస్తే చోద్యం చూస్తూ ఉండిపోయాయని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలని, రాజ్యాంగ నిర్మాతను గౌరవించే పార్టీలతో స్నేహం చేయాలని సూచించారు.
ఇక తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని కూడా ఆమె వదిలి పెట్టలేదు. ఏపీలో దళితుగు, బీసీల ఓట్లతో అధికారం అనుభవించిన వైసీపీ… అంబేద్కర్ ను అమిత్ షా అవమానిస్తే కనీసం నోరు మెదిపేందుకు కూడా ఆ పార్టీ సాహసించలేదని ఆమె ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోని బీజేపీతో జగన్ ది అక్రమ సంబంధమని కూడా ఆమె ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కారణంగానే భిన్న మతాలు, కులాల సమాహారమైన భారత్ ఇప్పటికీ ఏకతాటిపై నడుస్తుందన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని షర్మిల పిలుపునిచ్చారు.
This post was last modified on January 10, 2025 1:13 pm
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…