తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిచిపోయింది. గడచిన రెండు రోజులుగా ఈ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నుంచి తెలంగాణ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు బీర్ల సరఫరా జరగడం లేదు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే… తెలంగాణలో ఎక్కడ కూడా కింగ్ ఫిషర్ బీర్లు దొరికే పరిస్థితి లేదు. వెరసి బీరు ప్రియులకు కరువు తప్పేలా లేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం టీజీబీసీఎల్ వద్ద గురువారం ఉదయం నాటికి 14 లక్షల కేసుల కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ మాత్రమే ఉంది. తెలంగాణలో మొత్తం బీర్ల వినియోగంలో కింగ్ ఫిషర్ బీర్లు 60 నుంచి 70 శాతం వాటాను ఆక్రమించేశాయి. అంటే… ఈ బీర్ల స్టాక్ ఒక్క రోజులోనే భారీగా తగ్గిపోయి ఉంటుంది. ఇంకో రెండు రోజుల పాటు యూబీఎల్ నుంచి బీర్ల సరఫరా పునరుద్ధరణ కాకపోతే… టీజీబీసీఎల్ వద్ద కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ ఖాళీ అయిపోవడం ఖాయమే. ఏళ్ల తరబడి బీర్ల తయారీదారులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరల పెంపు లేకపోవడం, బకాయిలు భారీగా పోగుపడిపోవడం కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిచిపోవడానికి కారణమన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే… కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా, వాటి ధరల పెంపుపైై తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ధరలను పెంచాలని ఏ కంపెనీ అయినా కోరడం సహజమేనని చెప్పిన మంత్రి… యూబీఎల్ మాత్రం ఏకంగా 33 శాతం మేర ధరలను పెంచాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరుతోందని తెలిపారు. ఈ మేర ధరల పెంపు అసాధ్యమని ఆయన తేల్చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం వద్ద కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ భారీగానే ఉందని చెప్పిన మంత్రి… యూబీఎల్ దిగిరాక తప్పదన్న భావనను వెలిబుచ్చారు.
మరోవైపున యూబీఎల్ కూడా గురువారం ఓ కీలక ప్రకటన జారీ చేసింది. 2019 నుంచి తమ బీర్లకు చెల్లిస్తున్న ధరలను ప్రభుత్వం సింగిల్ పైసా కూడా పెంచలేదని తెలిపింది. ఐదేళ్లుగా బీర్ల ధరలు పెంచని కారణంగా… నష్టాలకే తాము బీర్లను సరఫరా చేస్తున్నామని తెలిపింది. అయితే తెలంగాణలోనే తాము బీర్లను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరలకే బీర్లను తెలంగాణ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపింది. ఓ వైపు నష్టాలు, మరోవైపు భారీగా పేరుకుపోయిన బకాయిల కారణంగానే బీర్ల సరఫరాను నిలిపివేశామని తెలిపింది. తాజా పరిస్థితిని సమీక్షించి బీర్ల ధరల సవరణ దిశగా సర్కారు నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మరి యూబీఎల్ దిగి వస్తుందో, లేదంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో తెలియదు గానీ… బీర్ల సరఫరా పునరుద్ధరణ కాకపోతే రాష్ట్రంలో బీర్లకు కరువు తప్పదని చెప్పాలి.
This post was last modified on January 10, 2025 11:21 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…