ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ… రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా కీచులాడుకుంటున్న ఈ ఇద్దరు నేతలు కలిసే ఫారిన్ ట్రిప్ కు వెళుతున్నారా? అనుకోకండి. ఎందుకంటే… జగన్ పర్సనల్ పని మీద ఫారిన్ ట్రిప్ వెళుతుంటే… చంద్రబాబు మాత్రం సీఎం హోదాలో అదికారిక పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇక ఇద్దరూ ఒకే సమయంలో విదేశాలకు వెళుతున్నా…వారి ప్రయాణ మార్గాలు మాత్రం వేర్వేరనే చెప్పాలి. అయితే ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు ఇద్దరు నేతలూ ఫారిన్ లోనే ఉండనున్నారు. అంటే… ఆ రోజుల్లో ఇటు సీఎం చంద్రబాబు, అటు మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి దూరంగా విదేశాల్లో ఉంటారన్న మాట.
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు విదేశీ యానానికి వెళుతున్నారు. ఈ నెల 20న బయలుదేరనున్న చంద్రబాబు… నాలుగు రోజుల పాటు దావోస్ లోనే ఉండనున్నారు. అధికారులతో కలిసి వెళుతున్న చంద్రబాబు… అక్కడికి వచ్చే వ్యాపారవేత్తలతో చర్చల్లో పాలుపంచుకుంటారు. ఏపీకి పెట్టుబడులు రాబట్టే దిశగా చంద్రబాబు కృషి చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం దావోస్ లో ఓ స్టాల్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ స్టాల్, దాని పరిసరాల్లో ఉండనున్న చంద్రబాబు… తనను కలిసే పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఏపీలో ఉన్న అపార అవకాశాలను వారి ముందు పెట్టనున్నారు. ఈ సదస్సు ముగియగానే… చంద్రబాబు తిరిగి విజయవాడ వచ్చేస్తారు.
ఇక జగన్ విషయానికి వస్తే… జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో విద్యనభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే లండన్ వెళ్లిన ఆమె తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన సందర్బంగా జరిగే వేడుకల్లో పాలుపంచుకునేందుకు జగన్ లండన్ వెళుతున్నారు. ఇప్పటికే తన లండన్ టూర్ కు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణను ముగించిన కోర్టు.. గురువారం జగన్ లండన్ టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న లండన్ ఫ్లైట్ ఎక్కనున్న జగన్… ఈ నెల 30 వరకు అక్కడే ఉండనున్నారు. మొత్తంగా సీఎం, మాజీ సీఎంలు ఇద్దరూ ఒకే సమయంలో విదేశాలకు వెళుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on January 9, 2025 8:47 pm
పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న…
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ మారణ హోమం.. దేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తోంది. దేశంలో ఉగ్రవాదానికి చాలా మటుకు…
నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాది దాడిలో 28 పైగా అమాయక టూరిస్టులు చనిపోవడం యావత్…
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య అందరిని ఉలిక్కిపడేలా చేసింది. 68…
పుష్ప విలన్ గా మనకు బాగా దగ్గరైన మలయాళ హీరో ఫాహద్ ఫాసిల్ తో బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా…
ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ దాదాపుగా ఏడాదికి పైగానే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నారు. దువ్వాడకు సంబంధించి…