రాష్ట్రానికి సంబంధించి విజన్-2047
ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస విజయాలు అందిస్తున్న కుప్పం నియోజకవర్గం రుణం తీర్చుకునేందుకు కూడా రెడీ అయ్యారు. దీనిలో భాగంగా ఆయన సుదీర్ఘకాలం తన పేరు చిరస్థాయిగా ఉండేలా.. స్వర్ణ కుప్పం విజన్ -2029
.. ఫ్యూచర్ ప్లాన్‌ను విడుదల చేశారు. సోమవారం తన నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఈ డాక్యుమెంటరనీ విడుదల చేయడం గమనార్హం.
ఏంటి స్పెషల్?
ఇటీవల విజన్ -2047 విడుదల చేసిన చంద్రబాబు.. వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాల న్న విషయంపై పక్కా ప్రణాళికలను రూపొందించారు. ఉపాధి, ఉద్యోగాలు, స్వావలంబన, మహిళల అభ్యున్నతి, సాంకేతికతకు పెద్దపీట, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వంటివాటిని ఆయన ప్రధానం గా ప్రస్తావించారు. అలానే ఇప్పుడు తన నియోజకవర్గానికి పరిమితం అవుతూ.. ఇలానే విజన్‌ను ఆవిష్కరించారు. దీనిలో భాగంగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు.
ఇవీ లక్ష్యాలు..
- కుప్పం నియోజకవర్గం పరిధిలోని 3 లక్షల మందికి పైగా ఉపాధి అకాశాలు కల్పిస్తారు.
- పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు.
- కేవలం కుప్పం నియోజకవర్గానికి రెండు కొత్త డెయిరీలు తీసుకువస్తారు.
- నియోజకవర్గంలో సుమారు రూ.15 వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు.
- ప్రతి ఇంటికీ సౌర విద్యుత్‌ను అందించేలా ఏర్పాట్లు చేస్తారు.