న్యూఇయర్ బ్లాస్ట్.. మద్యం అమ్మకాల్లో న్యూ రికార్డు

Delhi Liquor Scam : CBi Charge Sheet Revelas Shocking Details

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులను నమోదు చేశాయి. డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు పెద్ద ఎత్తున మద్యం వినియోగం చేయడంతో ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. ప్రత్యేకంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే మద్యం అమ్మకాల విలువ వెయ్యి కోట్లను దాటింది. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 520 కోట్ల మద్యం అమ్మకాలతో అతి పెద్ద విక్రయ దినంగా నిలిచింది.

డిసెంబర్ నెల మొత్తం లెక్కిస్తే రూ. 3,800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో 38 లక్షల కేసుల లిక్కర్, 45 లక్షల బీర్ కేసులు అమ్ముడైనట్లు సమాచారం. సాధారణ రోజుల్లో రోజుకు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల మధ్య మద్యం అమ్మకాలు ఉండగా, డిసెంబర్ నెలలో ఈ లెక్క పూర్తిగా పెరిగిపోయింది. పండుగల సీజన్, న్యూఇయర్ వేడుకలు మద్యం వినియోగంలో భారీ పెరుగుదలకి కారణమయ్యాయి.

మద్యం అమ్మకాల లెక్కలు పరిశీలిస్తే, డిసెంబర్ 25 నుంచి 31 వరకు మొత్తం రూ. 1,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండడంతో ఈ లెక్కలు మరింత పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొన్నాయి. మందుబాబుల సందడి ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తీసుకువచ్చింది. ఈ పరిస్థితిపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పండుగల పేరుతో మద్యం వినియోగం అనివార్యమైపోతుండటంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు అయితే దీన్ని రాష్ట్ర ఆదాయ వనరుగా చూస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలు సమాజంలో మద్యం వినియోగంపై కొత్త చర్చకు దారితీశాయి.