ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీ నుంచి పెట్టుబడుల కోసం ప్రపంచ ప్రయాణం చేయనున్నారు. ఏపీలో ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పెట్టుబడులపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అనేక సంస్థలను ఇప్పటికే ఆయన రాష్ట్రానికి ఆహ్వానించారు. అదేసమయంలో మరికొన్ని గతంలోనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చి.. వైసీపీ జమానాలు వెనక్కి మళ్లిపోయాయి. వాటిని కూడా తాజాగా చంద్రబాబు ఆహ్వానించారు. త్వరలోనే ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇవి కాకుండా.. ప్రత్యేకంగా విదేశీ సంస్థలను ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ రెండు నెలల కిందట అమెరికా పర్యటనకు కూడా వెళ్లారు.
ఇక, ఇప్పుడు దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, మండపల్లి రాంప్రసాద్‌రెడ్డి, పయ్యావుల కేశవ్ తదితరులు వెళ్తున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏటా ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తారు. ఈ ఏడాది జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు వరకు దావోస్ ఈ సదస్సు జరగనుంది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ ఆధ్వర్యంలో ఈ సదస్సు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడి దారులు, అగ్ర స్థాయి వాణిజ్య వేత్తలు, వ్యాపార వేత్తలు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోవారిని ఆకర్షించేందుకు చంద్రబాబు బృందం ఈ నెల 19నే దావోస్‌కు వెళ్లనుంది.
రాష్ట్రంలో ప్రబుత్వం మారిన తర్వాత.. ఏర్పడిన సానుకూల పరిణామాలు, శాంతి భద్రతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా చంద్రబాబు వివరించనున్నారు. అదేసమయంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యాలను కూడా వివరిస్తారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్కిల్ డూయింగ్ బిజినెస్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా వివరాలను దావోస్ సదస్సులో వివరించనున్నారు. అదేవిధంగా ‘షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్’ థీమ్ ను పరిచయం చేయనున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ నగరాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రపంచ స్థాయి పెట్టుబడి దారులకు వివరించి.. వారిని ఏపీకి రప్పించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
This post was last modified on January 2, 2025 9:37 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…