నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మంగళగిరిలో పార్టీ నేతలు, ఉన్నతాధికారులు,కార్యకర్తలు చంద్రబాబుకు న్యూ ఈయర్ విషెస్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…జగన్ పాలనపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
జగన్ హయాంలో ప్రజలు, అధికారులు, పోలీసులు, మీడియా చాలా ఇబ్బంది పడ్డారని, 2024లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని అన్నారు. అందుకే, 2024 చాలా హిస్టారికల్ ఇయర్ అని చంద్రబాబు చెప్పారు. ఈ 6 నెలల్లో జనానికి ఒక హోప్ వచ్చిందని, నాలుగోసారి సీఎం ఆయ్యాక తనకు కొత్త అనుభవం ఎదురైందని అన్నారు. లోతుకు వెళ్ళే కొద్దీ ఇంకా లోతు తెలుస్తోందని, వైసీపీ హయాంలో అధికారులందరికీ చాలా వింత అనుభవాలు కలిగాయని తెలుసకున్నానని చెప్పారు.
అమరావతికి, పోలవరానికి జగన్ చిక్కుముడులు వేశాడని, వాటిని ఒక్కొక్కటిగా విప్పి ట్రాక్‌లో పెట్టానని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పరిస్థితులపై, సినిమాలపై చంద్రబాబు మాట్లాడారు. హైదరాబాద్ సినిమా హబ్ అని, సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందని చెప్పారు. దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద చేయాలని, ఇప్పుడు సినిమా గురించి అంత అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
తమ పార్టీ ప్రెసిడెంట్ బీసీ, కేంద్ర మంత్రి బీసీ, సీఎస్ విజయానంద్ బీసీ…తాను సోషల్ రీ ఇంజనీరింగ్ చేస్తున్నానని అన్నారు. అయితే, చీఫ్ సెక్రటరీ విజయానంద్ సమర్థతతో పాటు బీసీ కావడం అర్హతలని చెప్పారు.
వైసీపీ నేతలు షెల్టర్ కోసం ఈ మూడు పార్టీల్లోకి వస్తున్నారని, దీనిపై మూడు పార్టీలలో చర్చ జరుగుతోందని, అన్ని విషయాలు మాట్లాడుకుంటామన్నారు. జగన్ హయాంలో టీడీపీవాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారని, అందరికీ పదవులు ఇవ్వలేం కదా అని అన్నారు. అయితే, తాను గతంలోలాగా లేనని, అన్ని విషయాలు చూసుకుంటున్నానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates