ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా భువనేశ్వరి.. ఆదివారం కీలకమైన శాంతిపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్య టించారు. నేటితో ఆమె పర్యటన ముగియనుంది. ఈ క్రమంలో చేల్దగాని పల్లె గ్రామంలో ఆమె డ్వాక్రా మ హిళా సంఘాలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వారికి అందుతు న్న రుణ సదుపాయాలు, సంక్షేమ పథకాల వివరాలు అడిగారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు.
అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. నారా కుటుంబం.. ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉందని తెలిపారు. ఏనాడైనా ప్రజలకు సేవ చేయడమే తప్ప.. ప్రజల నుంచి ఒక్కరూపాయి కూడా నారా కుటుం బం ఆశించలేదని చెప్పారు. కానీ కొన్ని మీడియాలు.. నారా కుటుంబానికి వ్యతిరేకంగా కథలు రాస్తూ.. ఆవేదనకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. నారా కుటుంబం చేస్తున్న సేవలు.. లక్షల మంది ప్రజల కు చేరుతున్నాయని చెప్పారు. తమ కుటుంబం ఉన్నన్నాళ్లూ ఈ సేవలు కొనసాగుతాయని చెప్పారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు నరకం అనుభవించారని.. ప్రజలు అనుభవించిన బాధలతో పోలిస్తే.. నారా కుటుంబం అనుభవించిన బాధలు తక్కువేనని చెప్పారు. అయినా.. చంద్రబాబును జైలుకు పంపించడం తమ కుటుంబంలో పెద్ద ఆవేదనను కలిగించిందన్నారు. అయినా.. ప్రజల కోసం చంద్రబాబు అలుపెరుగని విధంగా పనిచేశారని భువనేశ్వరి చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలు కూడా.. తమకు బ్రహ్మరథం పట్టారని వివరించారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిదని చెప్పారు.
ప్రతి మూడు మాసాలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని నారా భువనేశ్వరి తెలిపారు. నారా కుటుంబం అంటే.. పెట్టే చెయ్యే కానీ.. తీసుకునే చెయ్యి కాదన్నారు. ఈ విషయాలు ప్రజలకు తెలుసునని.. కానీ, కొందరికి తెలియక పోవడం బాధాకరంగా ఉందని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కుప్పం ప్రజలకు తాను అండగా ఉంటానని.. ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.