చూస్తుంటే పరిస్దితి ఇలాగే ఉంది. స్ధానిక సంస్ధల ఎన్నికలను జరిపే విషయమై శుక్రవారం హైకోర్టులో కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎందుకు జరపటం లేదంటూ కోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను జరిపే అవకాశం లేదంటూ అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నపుడు ఏపిలో మాత్రం స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎందుకు జరపలేరంటూ కోర్టు నిలదీసింది. దాంతో వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయంటూ ఏజీ జవాబు ఇవ్వటంతో ఆ విషయం చెప్పాల్సింది ప్రభుత్వం కాదని ఎన్నికల కమీషన్ అంటూ మండిపడింది.
కేసు విచారణ సందర్భంగా కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను జరపలేమన్న విషయాన్ని ఈసీకి చెప్పలంటూ కోర్టు ఏజీకి చెప్పింది. అలాగే ఈసీ తన వాదన ఏమిటో వినిపించాలంటూ నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మళ్ళీ ఇదే కేసును నవంబర్ 2వ తేదీన విచారిస్తామని కోర్టు చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి మార్చిలో జరగాల్సిన స్దానిక సంస్ధల ఎన్నికలను ఈసీ ఏకపక్షంగా వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో కరోనా వైరస్ వ్యాప్తిని కారణంగా చూపించే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. నిజానికి అప్పట్లో రాష్ట్రం మొత్తం మీద నెల్లూరులో కేవలం ఒక్క కేసు మాత్రమే రిజిస్టర్ అయ్యింది.
మరిపుడు కేసులు వేలల్లో రిజిస్టర్ అవుతున్న సమయంలో ఎన్నికలను ఎందుకు నిర్వహించరంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈసీకి నోటీసులిచ్చింది. మరిపుడు ఈసీ ఏమంటుంది ? ఏమంటుంది ఎన్నికల నిర్వహణకు తాము రెడీగా ఉన్నట్లు నిమ్మగడ్డ కోర్టుకు చెబుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సాధ్యం కాదంటుంది.
ఏపిలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు, బీహార్ ఎన్నికల నిర్వహణకు పోలికే లేదు. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ముగిసిపోతోంది. అందుకనే కేంద్ర ఎన్నికల కమీషన్ బీహార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. షెడ్యూల్ కారణంగా బీహార్ లో ఎన్నికలు జరపటం అత్యవసరం. మరి ఆ అవసరం ఏపిలో స్ధానికి సంస్ధలకు లేదుకదా. నిజానికి రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగాల్సింది 2018, జూన్ లోనే. కానీ అప్పట్లో ఎవరూ కోర్టుకు పోలేదు. దీంతో ఏ ఇబ్బంది రాలేదు. ఇపుడు గనుక ఎన్నికల నిర్వహణకు రెడీ అని ఈసీ అంటే ప్రభుత్వంతో మళ్లీ ఘర్షణ తప్పేలా లేదు. స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పింది ఈసీకి. మరి ఈసీ ఏమి చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. చూద్దాం ఏమి జరుగుతుందో.
This post was last modified on October 10, 2020 5:29 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…