పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు. కానీ మదగజరాజా దాన్ని బ్రేక్ చేసి ఏకంగా 40 కోట్లకు పైగా వసూలు చేయడం దక్షిణాది ట్రేడ్ లో అతి పెద్ద సెన్సేషన్ అయ్యింది. కేవలం తమిళంలో మాత్రమే రిలీజైనప్పటికీ ఈ స్థాయి స్పందన దర్శక నిర్మాతలు ఊహించలేదు.
గత కొన్నేళ్లుగా భారీ బడ్జెట్ తో ఎన్నో యాక్షన్, ఎలివేషన్ చిత్రాలు చేస్తున్న విశాల్ వాటి ద్వారా అందుకోని విజయం ఇప్పుడు రుచి చూడటంతో అతని ఆనందాన్ని పట్టుకోవడం ఎవరి వల్లా కావడం లేదు. ఇప్పుడీ ఫలితం ప్రభావం ఎన్నింటినో బూజు దులిపేలా చేస్తోంది.
కోలీవుడ్ లో ప్రస్తుతం ముప్పై దాకా సినిమాలు వివిధ దశల్లో మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి. విక్రమ్ – గౌతమ్ మీనన్ కాంబోలో రూపొందిన ధృవ నక్షతం మీద ఏడేళ్లుగా కోట్ల రూపాయల పెట్టుబడులు వడ్డీల భారంతో కృంగిపోతున్నాయి. కస్టడీ ఫేమ్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన పార్టీని థియేటర్లలో వదిలేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అన్నీ విఫలమే.
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించిన క్వీన్ రీమేక్ పారిస్ పారిస్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇదం పొరుళ్ ఎవల్ (విజయ్ సేతుపతి), నరగాసురన్ (అరవింద్ స్వామి-శ్రేయ), అగ్ని సిరగుగల్ (విజయ్ ఆంటోనీ), కా ది ఫారెస్ట్ (ఆండ్రియా) వాటిలో మరికొన్ని.
ఇవి కాకూండా సతురంగ వెట్టై 2 (త్రిష – అరవిందస్వామి), మాయ (ఎస్జె సూర్య), గర్జనై (త్రిష), ది టెస్ట్ (నయనతార – మాధవన్ – సిద్దార్థ్), వలిమయిల్ (విజయ్ ఆంటోనీ), గాంధీ టాక్స్ (విజయ్ సేతుపతి), ఫ్లాష్ బ్యాక్ (ప్రభుదేవా) ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది. ఇక్కడ ప్రస్తావించినవి కేవలం మన తెలుగు ఆడియన్స్ కూడా పరిచయమున్న ఆర్టిస్టులవి మాత్రమే.
అన్నీ కుదిరితే డబ్బింగ్ వెర్షన్ల రూపంలో మన దగ్గరికి వస్తాయి. మదగజరాజా ఫలితం చూశాక ఇప్పుడు వీటి దర్శక నిర్మాతలు ఎలాగైనా బయటికి తీసుకొచ్చే మార్గాల మీద దృష్టి పెడుతున్నారట. దాదాపు అన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్నావే కావడం గమనార్హం.
This post was last modified on January 22, 2025 6:42 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…