విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామి
గా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ అనేక రాజకీయాలు సాగాయి. వైసీపీ అధినేత జగన్ సైతం ఆయన కనుసన్నల్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలా.. వైసీపీ స్వామిగా పేరొందిన స్వరూపానందేంద్రకు తాజాగా హైకోర్టు లో భారీ షాక్ తగిలింది. తిరుమలలో ఆయనకు వైసీపీ హయాంలో కేటాయించి భూమి విషయంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేటాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయని నిరూపితమైందని తెలిపింది.
ఈ క్రమంలో ఆయా భవనాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. అంతే కాదు.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టేవారికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచేలా తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేయడం మరింత సంచలనంగా మారింది. తిరుమలలో గోగర్భం డ్యామ్‌కు నష్టం చేకూరేలా నిర్మాణాలు సాగించారన్న ప్రభుత్వవాదనతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బిల్డింగ్ ప్లాన్, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని కూడా శారదాపీఠం నిర్వాహకుల తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను చూస్తూ కూర్చుంటే.. రేపు హైకోర్టును కూడా ఆక్రమించేసే పరిస్థితులు వస్తాయని వ్యాఖ్యానించింది.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో తిరుమలలో శారదా పీఠం కోసం.. గోగర్భం డ్యామ్‌కు సమీపంలో భూములు కేటాయించారు. అక్కడ వేద పాఠశాలతోపాటు.. ఉచిత వైద్య శాలను నిర్మించేందుకు అనుమతులు తీసుకున్నారు. దీనికి అప్పటి టీటీడీ పాలక మండలి చైర్మన్, వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు అనుమతులు ఇచ్చింది. అనంతరం.. నిర్మాణాలు ప్రారంభమ య్యాయి. అయితే.. ఇచ్చిన స్థలం కంటే ఎక్కువగా భూమిని ఆక్రమించి నిర్మాణాలు సాగించారని, నిబంధనలను కూడా తోసిపుచ్చారని పేర్కొంటూ.. అప్పట్లోనే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈ క్రమంలో తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, ప్రముఖ లాయర్ ఓం కార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారించిన హైకోర్టు నిర్మాణాలను నిలుపుదల చేసి టీటీడీకి నోటీసులు జారీ చేసింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. టీటీడీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించింది. తప్పులు జరిగాయని పేర్కొంది. దీనిపై లోతైన పరిశీలన జరుగుతోందని వివరించింది. తాజాగా బుధవారం నాటి విచారణలో ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు.. శారదాపీఠంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అఫిడవిట్ దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on January 22, 2025 8:37 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…