Movie News

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ గా అభిమానులకు అఖండ చాలా ప్రత్యేకం. అందులోనూ స్టార్ హీరోలు రిస్క్ గా భావించే అఘోరా పాత్రను బాలయ్య అద్భుతంగా పోషించిన తీరు, తమన్ ఇచ్చిన గూస్ బంప్స్ నేపధ్య సంగీతం దాని స్థాయిని పదిరెట్లు పెంచాయి.

అందుకే సీక్వెల్ కోసం రెండేళ్ల నుంచి ఫ్యాన్స్ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు దాన్ని 2025 సెప్టెంబర్ లో నెరవేర్చబోతున్నారు. అయితే కంటెంట్ కు సంబంధించిన ఇప్పటిదాకా పెద్దగా విశేషాలు బయటికి రాలేదు.

తాజాగా అనంతపూర్ లో జరిగిన డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ ఒక కీలక అప్డేట్ ఇచ్చాడు. ఇంటర్వెల్ కే పూర్తి డబ్బులు ఇచ్చేయొచ్చని అంత కసిగా దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్నారని, ముందే ప్రిపేర్ అయిపోమని అభిమానులకు పిలుపు ఇవ్వడం ఒక్కసారిగా హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది.

అఖండలో కీలకంగా నిలిచింది ఇంటర్వెల్ ఎపిసోడే. వన్ అఫ్ ది బెస్ట్ టాలీవుడ్ ఇంటర్వెల్స్ గా దీని గురించి విమర్శకులు సందర్భం వచ్చినప్పుడంతా చెబుతూ ఉంటారు. అలాంటిది అఖండ 2లో అంతకు మించే ఉంటుందంటే ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని కంట్రోల్ చేయడం కష్టం.

సెప్టెంబర్ 25 విడుదల తేదీని అధికారికంగా లాక్ చేసుకున్న అఖండ 2 అనుకున్న ప్రకారమే ఎలాంటి ఆలస్యం లేకుండా ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం లొకేషన్ల వేటలో ఉన్న బోయపాటి శీనుతో త్వరలోనే బాలయ్య జాయిన్ కాబోతున్నారు. మొదటి భాగంలో ఉన్న పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్లు తోడు కాబోతున్నాయి.

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా ఎపిసోడ్ అఖండ 2లో ఉండబోతోంది. అఘోరాగా నటించిన పెద్ద బాలయ్య చుట్టే సీక్వెల్ జరగనుందని టాక్. చిన్న బాలయ్య కూతురికి రక్షణగా పెదనాన్న ఏం చేశాడనే దానికి బోయపాటి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చి ఉంటాడనేది ఆసక్తికరం.

This post was last modified on January 22, 2025 9:26 pm

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

2 hours ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

2 hours ago

విమానంలోనే కాక్రోచ్ నాయకుడి అరెస్టు

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…

4 hours ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

5 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

5 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

7 hours ago