డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు జనవరి 14 వతేదీ కళ్ల ముందే కనిపిస్తోంది. ఈ సమయానికి ఆయన పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావడం అత్యంత కీలకంగా మారింది. దీనికి గాను మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడం.. పనులు వేగంగా పూర్తి కాకపోవడంతో పవన్ తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకీ ఆయన నిర్దేశించుకున్న లక్ష్యం.. తన పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ.. రహదారులను సుందరీకరించడం. దీనికి గాను జనవరి 14 సంక్రాంతిని ఆయన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
రహదారుల మరమ్మతుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనిపై ఇప్పటికే రెండు సార్లు వర్చువల్‌గా గ్రామీణ ప్రాంత అధికారులు, పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యా రు. తన లక్ష్యాన్ని కూడా వివరించారు. కానీ, ఇప్పటి వరకు సగానకిపైగా గ్రామాల్లో పనులే ప్రారంభం కాలేదు. చేయాల్సిన పనులు ఎక్కువగా ఉండడం సమయం తక్కువగా ఉండడంతో ఏం జరుగుతుందో అని పవన్‌తర్జన భర్జన పడుతున్నారు.
ఇప్పటికి 861 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇవికేవలం గ్రామీణ ప్రాంత రహదారులను అభివృద్ధి పరిచేందుకేనని మొదట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా ప్రకటించారు. కానీ, కేవలం గ్రామీణ ప్రాంతాలను మాత్రమే డెవలప్ చేస్తే.. నగర వాసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన రహదారులు, భవనాల శాఖ మంత్రి కొంత మొత్తం నిధులను నగరాలకు కూడా కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విన్నవించారు. దీంతో 200 కోట్లను నగరాలకు వాడుకోవాలని ఆయన చెప్పారు.
అయితే.. ఈ విషయం డిప్యూటీసీఎంకు తెలియకపోవడం.. మొత్తం నిధులను గ్రామీణ ప్రాంతాలకే వాడుతున్నారని ఆయన భావించడంతో పనులు వేగంగా పుంజుకుంటాయని అనుకున్నారు. కానీ, పరిస్థితి అలా కనిపించడం లేదు. పైగా రాయల సీమ జిల్లాల్లో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లోనే పనులు చేపట్టేలా.. కాంట్రాక్టులు తీసుకోవడంతో సరిపుచ్చారు. ఇతర జిల్లాల విషయం ఇంకా పరిశీలనలోనే ఉందని తెలిసింది. దీంతో ఇప్పుడు టార్గెట్ చేరుకోవడంపై పవన్ దృష్టి పెట్టారు. మొత్తం నిధులను గ్రామీణ ప్రాంతాలకే ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates