వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పనులు సొంత పార్టీ వారికే కోపం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ‘జగన్‌లో మార్పు రావాలి’ అని చాలా మంది నాయకులు చెబుతున్నారు. అయినా.. జగన్ మాత్రం ఎక్కడా మారక పోవడం గమనార్హం. దీనికి తాజాగా జరిగిన పరిణామమే ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వైసీపీ నేతలను రంగంలోకి దింపారు జగన్. కూటమి సర్కారు రైతులకు అన్యాయం చేస్తోందని.. దీనిపై పోరాడాలని ఆయన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అంతేకాదు.. కొందరిని అరెస్టు చేసినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఇంత కీలకమైన సందర్భంలో జగన్ ఏం చేయాలి? పార్టీ అధినేతగా వారిని ముందుండి నడిపించాలి. లేదా.. తాడేపల్లిలో అయినా.. ఉంది దిశానిర్దేశం చేయాలి.
కానీ, ఈ రెండు విషయాలను వదిలేసిన జగన్.. తాను ఎంచక్కా బెంగళూరుకు వెళ్లిపోయారు. ఒకవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీనేతలను ధర్నాలకు, నిరసనలకు దిగాలని చెప్పిన పార్టీ అధినేత ఇలా బెంగళూరుకు చడీ చప్పుడు లేకుండా వెళ్లిపోవడాన్ని పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. కొందరైతే.. మధ్యలోనే కార్యక్రమాన్ని వదిలేసి వెళ్లిపోయారు.
విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో ఒక్కరంటే ఒక్కరూ బయటకు రాలేదు. ధర్నాలు చేయలేదు. అంటే.. ఇప్పుడు వైసీపీలో నాయకులకు దిశానిర్దేశం చేయాల్సిన అధినేతే.. బెంగళూరుకు వెళ్లిపోతే.. తాము మాత్రం ఎందుకు రంగంలో ఉండాలన్న చర్చ అయితే.. తెరమీదికి వచ్చింది. ఇదేం పద్ధతి? అంటూ.. ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
This post was last modified on December 13, 2024 4:02 pm
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…