రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ నమ్మరు. కానీ..రాజకీయాలు సాగుతాయి. అయితే.. ఉన్నవారిలో ఎవరు బెస్ట్ అనేది పార్టీల అధినేతలు నిర్ణయించుకోవాలి. కొన్ని సార్లు తగ్గడం.. మరికొన్ని సార్లు నెగ్గడం అనేది ఈ స్ట్రాటజీపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు .. భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి మనకు ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడా కనిపించదు.
కొన్ని రోజులు పంతానికి పోయినా.. తర్వాత తనేమిటో.. తన రాజకీయ ప్రస్థానం ఏమిటో చంద్రబాబు సాధ్యమైనంత వేగంగా తెలుసుకున్నారు. దీంతో నాలుగు మెట్లు కాదు.. నలభై మెట్లు దిగి వచ్చారు. ఇదీ.. రాజకీయం అంటే చూపించారు. అనేక సందర్భాల్లో తనకోసం వేచి ఉన్న వారి దగ్గర.. తను వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చినా.. తలాడించారే తప్ప ఎగరేయలేదు. ఫలితంగానే మరోసారి వస్తుందో రాదో అనుకున్న పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చేయడం ఖాయమనే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడు వైసీపీ పరిస్థితిని గమనిస్తే.. ఉన్నవారు ఒక్కొక్కరు కాదు.. మందలు మందలుగానే వెళ్లిపోతున్నా రు. ఇంకా వెళ్లిపోయే వారి జాబితా చాలా పెద్దదిగానే ఉంది. కాబట్టి.. వైసీపీకి వచ్చే నాలుగేళ్లు కూడా.. నరకమేనని చెప్పడంలో సందేహం లేదు. ప్రజా ఉద్యమాలకుసిద్ధమైన సమయంలోనే భారీ షాక్ ఇస్తూ.. కూటమి స్ట్రాటజీ ప్లాన్ చేయడంతో వైసీపీ విలవిలాడిపోయింది. అయినా.. పోయింది ఏమీ లేదని అనుకుంటే పొరపాటే. పోతున్నదానిని పరిగణనలోకి తీసుకుని.. మార్పు దిశగా వైసీపీ అడుగులు వేయాల్సి ఉంది.
ఇప్పటికిప్పుడు చేయాల్సింది.. వైసీపీలో అంతర్యుద్ధమే. తాడేపల్లి ప్యాలెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. అదేసమయంలో పార్టీలో ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరి నీ పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని విషయాలూ వినాలి. ముందుగా.. అధినేతపై గౌరవం కంటే.. నమ్మకం కలిగించాలి. ఏమో.. మనం ఏం చెప్పినా ఆయన వినడు! అనే మాటకు తావులే కుండా.. చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని జగన్ అనుసరించి.. అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయం లేదని.. తామే పెద్ద పార్టీని నిర్వహిస్తున్నామని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి లేదు. ప్రజలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం ఉంటూనే ఉంటుంది. పార్టీలకే ఉండదు..!
This post was last modified on December 15, 2024 8:46 am
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…