ఏపీలో సామాజిక భద్రత కింద ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ల పథకం.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తోంది. గత వారం పది రోజులుగా ఎక్కడ చూసినా పింఛన్ల పథకంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. తమ పింఛన్ తీసేస్తారేమో.. అనే బెంగతో చాలా మంది లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలిసిన వారిని అడుగుతున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వం నుంచి పింఛన్ల ను తగ్గించాలన్న స్పష్టమైన ఆదేశాలు రావడమే. ఇప్పటికే రెండు రోజులు 9, 10 తేదీల్లో సర్వే చేయాలని సర్కారు ఆదేశించింది.
అయితే.. దీనిని కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో వాయిదా వేశారు. కానీ, ఇప్పుడు పూర్తిస్థాయి పగ్గాలను కలెక్ట ర్లకే అప్పగించారు. అర్హులు కాని వారికి పింఛన్లు ఆపేయాలని.. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లను తగ్గిం చాలని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఎవరైనా పెంచి నప్పుడు ఆనందిస్తారు. కానీ, వస్తున్న సొమ్మును తీసేస్తే.. మాత్రం వ్యతిరేకిస్తారు. పైగా ఇప్పటి వరకు దివ్యాంగుల పింఛన్ విషయంలో ఎన్నడూలేని విధంగా సర్కారు వ్యవహరించడం కూడా.. చర్చకు దారితీసింది.
అయితే.. ప్రభుత్వానికి అనుమానాలు.. అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్న సందేహాలు ఉంటే.. అలాంటి వారిని గుర్తించడం వరకు తప్పులేదు. పైగా.. వీరంతా ఈ ఆరు మాసాల్లో లబ్ధి పొందిన వారు కాదు. వైసీపీ హయాం నుంచి రూ.3000 చొప్పున తీసుకుంటున్నవారే. పోనీ.. వీరిలోనూ అనర్హులు ఉన్నారని అనుకుంటే.. వారిని గుర్తించి.. పింఛన్ మొత్తాన్ని తగ్గిస్తే సరిపోతుంది.. తప్ప.. అసలు తీసేస్తే.. అది సర్కారుపై వ్యతిరేకతను.. సీఎం చంద్రబాబపై అపనమ్మకాన్ని పెంచుతుంది. సునిశితమైన ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక, అనాథలకు పింఛను ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇవి వినూత్న ఆలోచనగా చెప్పుకొచ్చా రు. కొత్తగా వీరిని పింఛన్ల జాబితాలో చేర్చాలని కూడా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కల ప్రకారం.. లక్ష మందికిపైనే అనాథలు ఉన్నారు. వీరిని లబ్ధిదారులుగా చేర్చడం తప్పులేక పోవచ్చు.. కానీ, ఉన్న వారిని తొలగించడమే ప్రభుత్వానికి ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇప్పటికీ ఆరు మాసాల పాలనలో నిత్యావసర ధరలుఏమీ తగ్గలేదు. పైగా విద్యుత్ చార్జీల మోత మోగుతూనే ఉంది. ఈ పాపాలను జగన్‌పైకితోసేసినా.. ఇప్పుడు పింఛన్లను తొలగిస్తే.. ఆ పాపం కూడా జగన్‌దే అంటే.. ప్రజలు నమ్ముతారా? అనేది ప్రశ్న.!!
This post was last modified on December 13, 2024 1:27 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…