Political News

నకిలీ పెన్షన్ దారులకు చంద్రబాబు వార్నింగ్

ఏపీలో సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పెన్షన్లు పొందారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పెన్షన్లను ఏరివేయాలని సీఎం చంద్రబాబు…కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి దగ్గర నుంచి పెన్షన్ మొత్తం సొమ్మును రికవరీ చేయాలని చంద్రబాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు.

10 వేల మందిలో 500 మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా సర్వేలో తేలిందని చంద్రబాబు అన్నారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి పెన్షన్ లబ్ధిదారుడిని జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని, అనర్హులను ఏరివేయాలని ఆదేశించారు. పెన్షన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్ సమర్పించిన వారితోపాటు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను కూడా ప్రాసిక్యూట్ చేయాలని చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్లు తెచ్చారని, అవి కూడా కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఇటువంటి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లుగా తమ పరిశీలనలో తేలిందని చంద్రబాబు అన్నారు.

ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని దంతా నియోజకవర్గంలో 484 పెన్షన్లు ఉన్నాయని, 78 వికలాంగుల పెన్షన్లలో 56 మంది అనర్హులని తేలింది. కలెక్టర్లు అనర్హులైన పెన్షన్ దారులందరిని మూడు నెలల్లోపు గుర్తించాలని, ఆ తర్వాత కూడా ఎవరైనా అనర్హలు పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే సంబంధిత కలెక్టర్ ను బాధ్యులను చేస్తామని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా అర్హులు కాకుండానే పెన్షన్ తీసుకుంటున్న వారికి పెన్షన్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

This post was last modified on December 12, 2024 6:03 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

19 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

27 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

42 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

43 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago