రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ వర్గాలకు కీలకమైన వక్ఫ్ బోర్డును తాజాగా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత.. ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అప్పట్లో ఏర్పాటు చేయలేదు. దీంతో జగన్ అదికారంలోకి వచ్చిన తర్వాత.. దానిని ఏర్పాటు చేసి.. బోర్డును కూడా నియమించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అజీజ్‌ను వక్ఫ్‌బోర్డుకు చైర్మన్‌గా నియమించారు.
అంటే.. కూటమి ప్రభుత్వం వైసీపీ లో ఉన్న బోర్డును రద్దు చేసి.. కూటమి పార్టీలకు చెందిన మైనారిటీ నాయకులతో బోర్డును ఏర్పాటు చేసింది. కానీ.. తాజాగా శనివారం అర్ధరాత్రి వక్ఫ్ బోర్డును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామం.. మైనారిటీ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే.. ఈ రద్దు వెనుక కూటమి పార్టీలోని బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఉంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించుకునే ప్రయత్నంలో ఉంది. దీనికి టీడీపీ మద్దతు ఇస్తోంది. ఇక, జనసేన ఆది నుంచి కూడా బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి లేకపోవడంతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కూటమి ప్రభుత్వం ఏపీలో బోర్డును రద్దు చేయడం సంచలనంగా మారింది.
అయితే.. కేంద్రం తీసుకువచ్చే సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. దానిప్రకారం బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీడీపీ మైనారిటీ నాయకులు చెబుతున్నారు. కానీ, దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రాజ్యసభలో బీజేపీకి బలమైన సంఖ్యలో సభ్యులు లేరు. కాంగ్రెస్ వక్ఫ్ చట్టాలను సమర్థిస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లు రాజ్యసభలో నెగ్గడం కష్టమేనన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు రద్దు చేసినా.. ఏర్పాటు చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో కూటమిపై మైనారిటీల ప్రభావం ఏమేరకు పడుతుందనేది చూడాలి.
This post was last modified on December 1, 2024 6:42 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…