అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు రేపు ఆదివారం కావడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. రేషన్ బియ్యం కొని విదేశాలకు అమ్ముతున్నారని, ఈ రేషన్ బియ్యం మాఫియాను వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు.
ఎక్కడ చూసినా మాఫియా, దోపిడీ ఉందని అంతా ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలో కూడా పైసా అవినీతి ఉండబోదని చంద్రబాబు అన్నారు. కర్ణాటకలో 1800 రూపాయలు మాత్రమే పెన్షన్ ఉందని, ఏపీలో మాత్రం 4000 రూపాయలు ఇస్తున్నామని గర్వంగా చెప్పారు. గత ఐదేళ్లలో విధ్వంసకరమై పాలన జరిగిందని, తవ్వేకొద్ది జగన్ సర్కార్ పాపాలు బయటపడుతున్నాయని విమర్శించారు.
రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచాల్సింది పోయి అప్పులతో పథకాల అమలు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం నాసిరకం మద్యంతో విచ్చలవిడిగా ప్రజలను దోచుకుందని, తాము వచ్చిన తర్వాతే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. డ్రగ్స్, గంజాయి అమ్మే వారిపై నిఘా నేత్రం ‘ఈగల్’ ఉంటుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు 48 గంటల్లోనే రిఫండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లపాటు ఇసుక దొరక్క లక్షలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారని, తమ ప్రభుత్వంలో ఆ సమస్య ఉండదని అన్నారు. ఉచిత ఇసుక పథకం అమలు విషయంలో ఎవరు అడ్డొచ్చిన సహించబోనని చంద్రబాబు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం అని, ఆ నియోజకవర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. త్వరలోనే నేమకల్లు ప్రాజెక్టు చేస్తామని, రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అంతకుముందు, ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి స్వయంగా ఇచ్చిన చంద్రబాబు వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సమీపంలోని కిరాణ దుకాణంలోకి వెళ్లిన చంద్రబాబు ఆ షాపు యజమానితో మాట్లాడారు. ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఆదాయం వస్తుంది అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. సంపద పెంచే మార్గాలను ఆ వ్యాపారికి చంద్రబాబు సూచించారు.
This post was last modified on November 30, 2024 6:54 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…