మీడియాపై యుద్ధానికి సిద్ధం అంటున్న జగన్!

మీడియాపై యుద్ధానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యారు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల పేర్ల‌ను ప్ర‌స్తా విస్తూ.. ఆయ‌న న్యాయ పోరాటం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఈ రెండు మీడియా సంస్థ‌లు.. త‌న ప‌రువును తీస్తున్నాయ‌ని, అదానీతో ఒప్పందం కుదుర్చుకోలేద‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. వినిపించుకోవ‌డం లేద‌న్న ది ఆయ‌న ఆవేద‌న ఈ క్ర‌మంలోనే న్యాయ పోరాటానికి రెడీ అవుతున్నాన‌ని కూడా చెప్పుకొచ్చారు.

ముందుగా ఆయా మీడియా సంస్థ‌ల‌కు నెల రోజుల స‌మ‌యంఇచ్చారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా కోరారు. లేక పోతే ఒక్కొక్క ప‌త్రిక‌పై 100 కోట్ల మేర‌కు ప‌రువున‌ష్టం దావా వేస్తాన‌న్నారు. అయితే.. జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న చిత్ర‌మేమీకాదు. ఇప్ప‌టికే దేశంలో చాలా మంది మీడియాపై పరువు న‌ష్టం దావా వేసిన వారు ఉన్నారు. వీరిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మ‌రో మంత్రి నితిన్ గ‌డ్క‌రీలు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

మీడియాపై ప‌రువు న‌ష్టం వేసి.. గెలిచిన వారు ఇప్ప‌టి వ‌ర‌కు అయితే క‌నిపించ‌లేదు. దీనికి కార‌ణం.. మీడియాకు ఉన్న రాజ్యాంగ‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19 భావ ప్ర‌క‌టా స్వేచ్ఛ‌కు ఎలా అయితే పూచీ వ‌హిస్తోందో.. అలానే మీడియా చేసేవ్యాఖ్య‌ల‌కు, వేసే వార్త‌ల‌కు కూడా.. ప‌త్రికా స్వేచ్ఛ వ‌ర్తిస్తుంది. అలాగ‌ని వ్య‌క్తిగ‌తంగా దూషిస్తే.. త‌ప్పే. కానీ, ఇక్క‌డ అదానీ నుంచి లంచాలు తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ద‌రిమిలా.. ఆ రెండు మీడియా సంస్థ‌లు వ‌రుస క‌థ‌నాలు రాస్తున్నాయి.

వీటిని డిఫెండ్ చేసుకునే ప‌రిస్థితి జ‌గ‌న్‌కు క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న న్యాయ పోరా టానికి దిగిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఈ పోరాటం ఏమేర‌కు ఆయ‌న‌కు మైలేజీ తీసుకువ‌స్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికూడా ఇలానే ఆ రెండు మీడియా సంస్థ‌లు అంటూ.. ఈ ప‌త్రిక‌లు, మీడియాపైనే నిప్పులు చెరిగే వారు. కానీ, న్యాయ పోరాటానికి ఎప్పుడూ దిగ‌లేదు.

దీనికి కార‌ణం.. న్యాయ పోరాటం చేసినా.. ఫ‌లితం ఉండే అవ‌కాశం లేదు. కానీ, ఇప్పుడు ఆయ‌న కుమారుడు మీడియాపై న్యాయ పోరాటానికి దిగుతాన‌ని తేల్చిచెబుతున్నా.. ఇది కేవ‌లం పేప‌ర్ పులి మాదిరిగానే మార‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో మ‌రిన్ని వివాదాలు కొని తెచ్చుకున్న‌ట్టేన‌ని చెబుతున్నారు.