అదానీతో విద్యుత్ ఒప్పందం, లంచం వ్యవహారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సెకీకి మధ్య జరిగిందని జగన్ అన్నారు. తక్కువ ధరకే విద్యుత్ కొన్న తనను పొగిడి శాలువా కప్పి అవార్డు ఇవ్వాల్సింది పోయి అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జగన్ కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని జగన్ కు షర్మిల సవాల్ విసిరారు.
అబద్ధాలను అందంగా అల్లడంలో జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇచ్చి శాలువా కప్పాలని సెటైర్లు వేశారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రూ 2.49 పైసలకు యూనిట్ కొనే సమయంలో సెకీ అమ్ముతోన్న విద్యుత్ గరిష్ట ధర రూ.2.16 అని, ఎక్కువ పెట్టి కొన్నందుకు శాలువలు కప్పాలా? అని ప్రశ్నించారు. గుజరాత్ యూనిట్ రూ 1.99 పైసలకే యూనిట్ కొన్న సమయంలో 50పైసలు ఎక్కువ పెట్టి ఏపీ కొన్నందుకు సన్మానం చేయాలా అని నిలదీశారు.
ఏ రాష్ట్రం అదానీతో ఒప్పందానికి ముందుకు రాని సమయంలో ఆఘమేఘాల మీద ఏపీ ఒప్పందం చేసుకుందని, అందుకు జగన్ కు అవార్డులు ఇవ్వాలా ? అని ఎద్దేవా చేశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ కు రూ.1.70 పైసలు పడతాయని ఇంధన శాఖ చెబుతోందని, ఎటువంటి ఛార్జీలు లేవని జగన్ చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధం కాదా? అని నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత ఎందుకు పాటించారో చెప్పాలని ప్రశ్నించారు.
అదానీతో జగన్ ఒప్పందం అంతర్జాతీయ స్కామ్ అని,1750 కోట్లు సీఎంకు ముడుపులు ఇవ్వడం చరిత్ర అని అన్నారు. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం, అర్ధరాత్రి ఫైళ్లు పంపడం, హడావిడిగా కేబినెట్ లో ఆమోదింపజేయడం చరిత్ర అని చురకలంటించారు. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని జనంపై మోపడం చరిత్ర అని అన్నారు. 2021లో ఏపీ చీఫ్ మినిస్టర్ కు లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, ఆనాడు సీఎం మీరు కారా, ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? అని ఎద్దేవా చేశారు. అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని షర్మిల సవాల్ విసిరారు. మరి, షర్మిల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on November 29, 2024 3:38 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…