జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం పవిత్రమైనదని, ఎంతో ప్రత్యేకమైనదని పవన్ అన్నారు. జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ మసకబారిందని పవన్ విమర్శించారు. ఐదేళ్ల జగన్ పాలనలో టీటీడీలో ఎన్నో అవకతవకలు జరిగాయని, తిరుమల ఆలయాన్ని జగన్ ఓ ఆదాయ వనరుగా చూశారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు.
వక్ఫ్ బోర్డు మాదిరిగా ఒక కామన్ బోర్డు హిందువులకు ఉండాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మ బోర్డు అవసరం ఉందని, అందుకే దానిని ప్రకటించానని అన్నారు. హిందూ ఆలయాలు హిందువుల ఆధ్వర్యంలోనే ఉండాలని, అన్యమతస్థులు ఉండకూడదని, మక్కాలో, జెరూసలేంలో అన్యమతస్తులు లేరని గుర్తు చేశారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఆలయాల వ్యవహారాలు మాత్రమే కోర్టుకు ఎందుకు వెళుతున్నాయని పవన్ ప్రశ్నించారు. ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఆలయాలు ఆదాయ వనరులు కావని అన్నారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాలు వాడారన్న ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం మాదిరి క్రిస్టియానిటీ, ఇస్లాంలో జరిగితే ఆ మతస్తులు తీవ్రంగా స్పందిస్తారని, కానీ, హిందువులు మాత్రం ఆ స్థాయిలో స్పందించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లడ్డూ కల్తీ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని అన్నారు.
తాను హిందువునని, అదే సమయంలో మిగతా మతాలను గౌరవిస్తానని పవన్ చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే బాధ కలుగుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్కాన్ మాజీ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు, తదనంతర పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. బంగ్లాదేశ్ హిందూ మైనార్టీలపై జరుగుతున్న దారుణాలు ఆపేందుకు బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలస్తీనాలో ఏమైనా జరిగితే ప్రపంచమంతా మాట్లాడుతుందని, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దానిపై ఎవరూ స్పందించట్లేదని పవన్ అన్నారు.
This post was last modified on November 28, 2024 8:53 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు.…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…
రాజ్యసభకు సంబంధించి ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో రెండు టీడీపీ తీసుకుని.. ఒకటి మాత్రం కూటమి పార్టీలకు…