Political News

రాహుల్ కంటే ప్రియాంకే బెట‌ర్‌?.. కాంగ్రెస్‌లో సంకేతాలు!

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ సార‌థ్యంపై సొంత పార్టీలోనే లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి పార్టీ అధ్య‌క్షుడిగా రాహుల్ లేరు. ఈ బాధ్య‌త‌లు క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే చూస్తు న్నారు. అయితే.. ఎంత తెర‌చాటున ఉన్నా.. రాహుల్ చ‌క్రం తిప్పుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ చ‌క్రాలు.. ఈ సూచ‌న‌లే.. కాంగ్రెస్‌కు మేలు చేయ‌క‌పోగా న‌ష్టాన్ని చేకూరుస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. కాంగ్రెస్‌లో రాహుల్‌కు మార్కులు త‌గ్గుతున్నాయి.

తాజాగా రాహుల్ సోద‌రి ప్రియాంక గాంధీ వాద్రా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నా రు. ఇదేదో సాధార‌ణ విజ‌యం అనుకుంటే పొర‌పాటే. ఐదు మాసాల కింద‌ట ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్ర‌జ‌లు.. మ‌రోసారి కూడా ఆ పార్టీకే ప‌ట్టం క‌ట్టారు. అది కూడా రాహుల్ కంటే కూడా ల‌క్ష ఓట్లు ఎక్కువ‌గా ప్రియాంక‌కు వేశారు. ఈ ప‌రిణామాలు కాంగ్రెస్‌లో చర్చ‌కు వ‌చ్చాయి. రాహుల్ కంటే కూడా ప్రియాంక బెట‌ర్ అనే చ‌ర్చ తాజాగా వెలుగు చూస్తోంది.

ఇక‌, తాజాగా పార్ల‌మెంటులో ప్రియాంక గాంధీ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా అన్ని టీవీ చానెళ్లు లైవులు ఇచ్చాయి. వీటికి వ‌చ్చిన వ్యూస్‌.. గ‌తంలో రాహుల్ తొలిసారి ఎంపీ అయిన ప్పుడు కూడా ఇలానే టీవీ చానెళ్లు ప్ర‌సారం చేశాయి. అయితే.. ఇన్ని వ్యూస్ రాలేదు. పైగా ఆమె రాజ్యాంగం పుస్త‌కాన్ని చేతిలో పెట్టుకుని మ‌రీ ప్ర‌మాణం చేయ‌డం కూడా అంద‌రినీ ఆస‌క్తిగా గ‌మ‌నించేలా చేసింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాహుల్ కంటే ప్రియాంకే బెట‌ర్ అంటూ.. మ‌హారాష్ట్ర సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున హ‌ల్చ‌ల్ చేసింది. రాహుల్ సార‌థ్యంలో ఇప్ప‌టికే 9 రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. 3 సార్వ‌త్రిక ఎన్నిక‌లు కూడా జ‌రిగాయి. అయితే.. మూడు సార్వ‌త్రిక(2014, 2019, 2024) ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం అయింది. 9 రాష్ట్రాల్లో కేవ‌లం రెండు చోట్ల మాత్ర‌మే గెలుపు గుర్రం ఎక్కింది. అది కూడా అతి క‌ష్టం మీద‌. ఈ నేప‌థ్యంలో రాహుల్ స్థానంలో ప్రియాంక అయితేనే బెట‌ర్ అన్న‌ది కాంగ్రెస్‌లోనే చ‌ర్చ సాగుతోంది. మున్ముందు ఈ వాద‌న బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది.

This post was last modified on November 28, 2024 8:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగనే ఎక్కువ సంప‌ద సృష్టించారట

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హ‌యాంలోనే రాష్ట్రంలో సంప‌ద సృష్టి జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు.…

1 hour ago

తిరుపతి ప్రసాదం పై పవన్ కమెంట్స్

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…

1 hour ago

ఉండి టాక్‌: ర‌ఘురామ‌.. హ్యాపీయేనా…!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు ఆనంద ప‌డుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉండి…

3 hours ago

కొన్ని కొన్ని సార్లు మిస్ చేసుకోడమే మంచిది సిద్ధార్థ్…

హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…

4 hours ago

పెద్ద‌ల స‌భ‌కు పెరుగుతున్న పోటీ.. బాబు క‌రుణ ఎవ‌రిపై..!

రాజ్య‌స‌భకు సంబంధించి ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో రెండు టీడీపీ తీసుకుని.. ఒక‌టి మాత్రం కూట‌మి పార్టీల‌కు…

5 hours ago