జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోలార్ విద్యుత్ ఒప్పందంపై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి చెబుతుండగా…చెవిరెడ్డికేం తెలుసని మాట్లాడుతున్నారని బాలినేని ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆ వ్యవహారం రాజేసిన రాజకీయ వేడి చల్లారక ముందే తాజాగా చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలో ఓ దళిత బాలికపై రేప్ జరిగిందని చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చెవిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. చెవిరెడ్డి కారణంగా తమ కుటుంబం తీవ్ర మానసిక వేదన అనుభవించిందని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో, చెవిరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అయితే, ఎన్నికలకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి వర్సెస్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్న రీతిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో గొడవలు, కొట్లాటలు, కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే చెవిరెడ్డిపై అక్రమ కేసు బనాయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, తమకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది.
This post was last modified on November 26, 2024 12:03 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…