ఒక గెలుపు పార్టీకి ఎంతో బలాన్నిస్తుంది. ఈ విషయంలో సందేహం లేదు. అయితే.. మహారాష్ట్రలో బీజేపీ దక్కించుకున్న సీట్లు, ఈ పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి దక్కించుకున్న విజయం అప్రతిహతం. గతానికి భిన్నంగా మరాఠా ఓటర్లను తమవైపు తిప్పుకొన్న తీరును విమర్శకులు సైతం అగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలకమైన మరాఠా నినాదం, విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్.. దీనికి మించి ఉల్లిపాయల రైతుల ఆందోళనలు.. వంటివి రాష్ట్రాన్ని ఇరుకున పడేశాయి.
ఇంత సెగలోనూ మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దక్కించుకుంది. ఈ గెలుపు వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యూహాలు, ఆయన మాటల చతురత, రాజకీయ వ్యాఖ్యలు వంటివి పక్కాగా కలిసి వచ్చాయనే చెప్పాలి. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. గెలుస్తామని ముందుగానే లెక్కలు వేసుకున్న నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అయితే.. శివసేనను చీల్చి, ఎన్సీపీని ముక్కలు చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం అంటూ ఆదిలోనే ఆరోపణలు వచ్చాయి. ఇదేసమయంలో కులగణన, యూనిఫాం సివిల్ కోడ్, జీఎస్టీ, ధరల పెరుగుదల, పెట్రోల్ చార్జీల వాతలు ఇలా అనేక ప్రతికూల పవనాలు కూడా కమలాన్ని తీవ్ర సంకటంలోకి నెట్టాయి. దీనికి తోడు ముందుగానే ముఖ్యమంత్రి పీఠంపై నేతలు పట్టుబట్టడంతోపాటు.. తమ తమ నియోజకవర్గాలకే కొందరు పరిమితమయ్యారు. దీంతో ప్రచారం ఒకానొక దశలో కుంటుపడింది.
ఖచ్చితంగా ఇలాంటి సమయంలో రంగ ప్రవేశం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రాజ్యాంగం నుంచి రిజర్వేషన్ల వరకు.. కుల గణన నుంచి కుటుంబ రాజకీయాల వరకు అనేక అస్త్రాలను ప్రయోగించారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే.. తండ్రి కొడుకులు పదవుల్లోకి వస్తారని, బావ బావమరుదులు పద వులు పంచుకుంటారని ఆయన కుటుంబ రాజకీయాలను ప్రస్తావించారు. అదేసమయంలో రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. అభివృద్ధికి ఆ పార్టీ వ్యతిరేకమని దుయ్యబట్టారు. మొత్తంగా మోడీ చేసిన ప్రచారం కూటమికి దన్నుగా మారింది. దీంతో ఊహించని విధంగా మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారం దక్కించుకుంది.
This post was last modified on November 23, 2024 6:16 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…