అదేంటి అనుకుంటున్నారా? ఏపీని వదిలేసి సీఎం చంద్రబాబు సాహసాలు చేసేందుకు యాత్రలు పెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? అయితే.. ఇది అలాంటి విన్యాసాలతో కూడిన యాత్ర కాదు. ఇది పొలిటికల్ సాహస యాత్ర, అధికార సాహస యాత్ర! తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ముందు చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు చూస్తే.. ఇది సాహసమేనని ఒప్పుకోక తప్పదు.
రెండు కీలక విషయాల్లో.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం సాహసం చేసింది. వీటిని సాధిస్తే.. ఈ యాత్ర సక్సెస్ కాదు.. సూపర్ డూపర్ సక్సెస్ అయినట్టే. చంద్రబాబు ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా చిరస్థాయి పేరు కూడా దక్కనుంది. అయితే.. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. ఈ ప్రతిపాదనలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించినవి కావడం!
ఏంటా ప్రాజెక్టులు..!
1) విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం పనులు. ఇది సాకారం అయితే.. రాజధాని అమరావతి నుంచి పెనమలూరు(కృష్ణా) వరకు.. అటు వైపు గుంటూరులోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ.. మెట్రో పరుగులు పెట్టనుంది. ఇది విభజన చట్టంలోనే ఉండడం గమనార్హం. కానీ, నిధుల విషయంలో 60:40 భరించాలని కూడా కేంద్రం చెబుతోంది. అయితే..ఇప్పుడు కేంద్రంలో ఉన్నది కూడా తామే కాబట్టి.. మొత్తం నిధులు రూ.42 వేల కోట్లకుపైగా సొమ్మును కేంద్రమే భరించాలని చంద్రబాబు తాజాగా నివేదిక పంపించారు.
2) విశాఖ మెట్రో రైలు నిర్మాణం: ఇది ఏకంగా 32 కిలో మీటర్ల పరిధిలో నిర్మించే అతి పెద్ద ప్రాజెక్టు. ఇది విభజన చట్టం లేదు. అయినా… కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి.. ఆ మేరకు సాయం చేయాలని కోరుతున్నారు. దీనికి కూడా.. సుమారు 46 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందనితేల్చారు. ఈ రెండు ప్రతిపాదనలను తాజాగా ఢిల్లీకి పంపించారు. ఇది తేలిక విషయం కాదు. పోలవరం వంటి ప్రాజెక్టుకే 40 వేల కోట్లు ఇచ్చేందుకు చేతులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం .. మెట్రో కోసంఇంత పెద్ద మొత్తంలో ఇస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇస్తే కనుక చంద్రబాబు సాహసం సక్సెస్ అయినట్టే.. రాష్ట్ర సమస్య తీరిపోయినట్టే!!
This post was last modified on November 23, 2024 6:09 pm
ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 12 రోజుల సమయమే మిగిలి ఉంది. ఇంత పెద్ద…
కొన్ని కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో జరిగింది. తాజాగా అమెరికాలో కేసులు నమోదయ్యాయని, సౌర…
ఈ సోషల్ మీడియా జమానాలో యూబ్యూటర్లు, ఇన్ స్టా ఇన్ ఫ్లూయన్సర్లు, బ్లాగర్లూ ఎక్కువయ్యారు. ఆయా మాధ్యమాల్లో ఎంత ఎక్కువ…
కీర్తి సురేష్ అంటే ఇంతకుముందు ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర ఉండేది. కెరీర్ ఆరంభం నుంచి ఆమె సంప్రదాయబద్ధమైన పాత్రలే…
సినీ ఇండస్ట్రీ భామలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. హాట్ ఫోటో షూట్స్‌తో ఫ్యాన్స్‌కు…
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ స్టార్, జనసేన…