ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసుకు ఏపీతో లింకులున్నాయన్న ప్రచారం నేపథ్యంలో గత ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడడం తన విధి అని షర్మిల అన్నారు. అయితే, వాస్తవానికి తాను జగన్ గారి గురించి ఇలా మాట్లాడకుండా ఉంటే, ఆయన అవినీతిని ఎత్తి చూపకుంటే తన ఆస్తి తనకు ఇస్తానని జగన్ అంటున్నారని విమర్శించారు.
రాజకీయంగా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడకుంటే తన ఆస్తి తనకు ఇస్తానని గతంలో జగన్ అన్నారని షర్మిల గుర్తు చేశారు. ఇలా మాట్లాడకపోతేనే తనకు లాభం అని, కానీ తాను కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిని కాబట్టి ఇలాంటివి మాట్లాడడం తన విధి, బాధ్యత అని షర్మిల అన్నారు. కాబట్టే పనిగట్టుకొని మాట్లాడాల్సి వస్తోంది అని చెప్పారు. గత ప్రభుత్వంలో అవినీతి బయటపడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున తాను మాట్లాడుతున్నానని, ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి తప్పులను కూడా తాను ఎత్తి చూపుతూనే ఉన్నానని అన్నారు.
ఇక, అదానీ కంపెనీలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, ఆయన కొలీగ్ గా తాను ఈ విజ్నప్తి చేస్తున్నానని షర్మిల అన్నారు. ఏపీని బ్లాంక్ చెక్ లా అదానీకి జగన్ రాసిచ్చారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. లంచాల కోసం ఏపీని సొంత జాగీరులా జగన్ వాడుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ ఒప్పందాల పేరుతో అదానీ నుంచి జగన్ 1750 కోట్లు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates