ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా అధినేత స్థాయిలో మార్పు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో నాయకులకు కూడా ఆయన భరోసా ఇవ్వలేక పోతున్నారు. దీంతో ఇంచార్జ్ లుగా బాధ్యతలు చేపట్టిన వారు కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఎవరికి వారు తమసొంత పనులు చేసుకుంటున్నారు.
ఏంటి కారణం..?
ఒక నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ఉన్న నాయకుడు ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి. ఈ ఉద్దేశంతోనే కొన్నాళ్ల కిందట జగన్ ఇంచార్జ్‌లను మార్చారు. ఆముదాల వలస నుంచి అనేక నియోజకవ ర్గాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలోనూ వైసీపీ తరఫున వీరు గళం వినిపించలేదు. పార్టీ తరఫున ప్రజల మధ్యకు వచ్చింది కూడా లేదు. దీంతో ఇంచార్జ్‌లు పార్టీకి భారం అవుతున్నారా? పార్టీనే వారికి భారం అవుతోందా? అన్నది చర్చ.
ఇక, అసలు ఇంచార్జ్‌లుగా ఉన్నవారి మనసులో ఏమున్నదనే విషయానికి వస్తే.. ఇప్పటి నుంచి వచ్చే ఐదేళ్లు కష్టపడేందుకు చాలా మంది రెడీగా అయితే లేరు. పైగా మనసుల్లోనూ బెరుకు వారిని వెంటాడు తోంది. వచ్చే ఐదేళ్లపాటు పోరాటాలు చేసినా.. చివరకు టికెట్ తమకే వస్తుందన్న గ్యారెంటీ ఉందా? అనేది ప్రధాన డౌట్. దీనికి కారణం..గత ఎన్నికల సమయంలో ఇంచార్జ్‌లను ఇష్టానుసారంగా మార్చేశా రు. వద్దన్నా వినకుండా షిఫ్టు చేశారు.
ఇలానే.. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకే టికెట్ ఇస్తారా? అనేది వారి సందేహం. ఇన్నాళ్లు కష్టపడి కేసులు పెట్టుకుని.. వీధి పోరాటు చేశాక..చివరి నిముషంలో కాదు పొమ్మంటే ఏంటనేది వారి సమస్య. అంతేకాదు..ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టేందుకు వెనుకాడుతున్నవారు కూడా ఉన్నారు. సో.. ఇలాంటి పరిస్థితి నుంచి పార్టీని బయట పడేయాల్సిన బాధ్యత జగన్‌పైనేఉంది. ఆయనే వారికి సర్దిచెప్పాలి. లేకపోతే.. ఇంచార్జ్‌లు ఇంకా డోలాయమానంలో చిక్కుకుంటారనేది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates