Political News

కేసీఆర్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్: రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది. హనుమకొండలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన రోజే రుణమాఫీపై చర్చ పెడతామని, కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

ఒక్కో ఆటగాడు ఒక్కో ఆటకు బ్రాండ్ అంబాసిడర్ అని, కేసీఆర్ ఫుల్ కో..హాఫ్ కో బ్రాండ్ అంబాసిడర్ అని షాకింగ్ కామెంట్లు చేశారు. తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికయ్యారని సెటైర్లు వేశారు. ప్రజలను మద్యం మత్తులో ఉంచి అధికారంలో ఉండాలని కేసీఆర్ భావించారని రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలని అన్నారు. ఫాం హౌస్ కు మందు కూడా తామే పంపించి ఆ మందుకు డబ్బులు కూడా తామే చెల్లిస్తామని రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు తెలివితో ఆలోచించి కేసీఆర్ కు దిమ్మతిరిగే సమాధానమిచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో కోల్పోయిన స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఈ పది నెలల్లో ప్రజలకు దొరికాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం నలుగురు వ్యక్తులు ఉద్యోగం కోల్పోయారని చురకలంటించారు. 10 నెలల కాలంలో 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, పదేళ్లలో కేసీఆర్ హామీ ఇచ్చి కూడా రుణమాఫీ చేయలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఓడిపోతే కేసీఆర్ ప్రజల మొహం చూడరా? ఆయన బయటకు ఎందుకు రావడం లేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తి వారి మధ్యకు ఎందుకు రావడం లేదో చెప్పాలని నిలదీశారు.

తెలంగాణ అభివృద్ధిని కిరాయి రౌడీలతో అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎవరో ఇస్తే తాను ఈ పదవిలోకి రాలేదని, అందరినీ తొక్కుకుంటూ ఇక్కడ వరకు వచ్చానని రేవంత్ రెడ్డి దూకుడుగా ప్రసంగించారు. కేసీఆర్ బయటకు రాకుండా ఇద్దరు చిల్లగాళ్లను తనపైకి వదిలారని పరోక్షంగా కేటీఆర్, హరీష్ లనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వబోనని రేవంత్ శపథం చేశారు.

This post was last modified on November 19, 2024 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్ కు క్యూసెక్కుల‌కు, టీఎంసీల‌కు తేడా తెలీదు

జ‌గ‌న్ కు ఆ ఛాన్స్ ఇవ్వం. మేమే పూర్తి చేస్తాం అంటూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో ప్ర‌క‌టించారు.…

6 mins ago

డబ్బులు లేవుగానీ ఆలోచనలు వున్నాయి

వైసీపీ హయాంలో ఏపీలో కొత్త రోడ్లు వేయడం సంగతి పక్కన పెడితే రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చ లేదని…

9 mins ago

మాల్యా, నీరవ్‌లను అప్పగిస్తారా: మోదీ డిమాండ్

జీ20 సదస్సు సందర్భంగా బ్రెజిల్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్‌తో కీలక సమావేశం…

4 hours ago

మిస్సింగ్ కేసుల రచ్చ పై పవన్ స్పందన

ఏపీలో 30 వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళల…

5 hours ago