జగన్ కు ఆ ఛాన్స్ ఇవ్వం. మేమే పూర్తి చేస్తాం
అంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. తమ్ముడి మరణం తర్వాత.. తొలిసారి అసెంబ్లీకి వచ్చిన ఆయన మంగళవారం సభలో చేపట్టిన సాగునీట ప్రాజెక్టులపై చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టునుతామే పూర్తి చేస్తామని ఈ సమయంలో చంద్రబాబు ప్రకటించారు. జగన్‌కు ఆ అవకాశం ఇచ్చేది లేదన్నారు. అదే సమయంలో పోలవరం ఎత్తును కూడా తగ్గించకుండా నిర్ణీత 45.72 మీటర్ల చొప్పునే నిర్మిస్తామన్నారు.
జగన్ కు క్యూసెక్కులకు, టీఎంసీలకు తేడా తెలియదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక్క జగన్‌కే కాదు.. అధ్యక్షా.. గతంలో మంత్రులుగా చేసిన వారికి కూడా టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలీదు
అని ఎద్దేవా చేశారు. గతంలో పోలవరం గరించి సభలో అడిగితే.. హేళనగా మాట్లాడారని గతాన్ని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పోలవరం పనులు జరిగాయని.. అయితే.. అది 3.08 శాతం పనులే జరిగాయని చెప్పారు. తమ గత హయాంలో రూ.16,493 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. కానీ, తమ తండ్రి ప్రాజెక్టుగా చెప్పుకొనే జగన్.. తనపాలనా కాలంలో కేవలం 4099 కోట్లు మాత్రమే విదిలించారని వివరించారు.
కేంద్రం నిధులు ఇస్తున్నట్టు చంద్రాబు చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, దీంతో వచ్చే రెండేళ్లలో 12 వేల కోట్లకుపైగా సొమ్ములు రానున్నాయని.. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి విడతల వారీగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు వివరించారు. వచ్చే నెలలోనే పనులు ప్రారంభం అవుతాయని, జనవరి నుంచి డయాఫ్రం వాల్ నిర్మాణం మొదలవుతుందన్నారు. ఇది 2026 నాటికి, పూర్తి ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి అవుతాయని సభలో పేర్కొన్నారు.
This post was last modified on November 19, 2024 10:33 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…