టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సానుభూతిపరుడిగా ముద్రపడిన వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎక్స్ లో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. నవంబర్ 19వ తేదీన విచారణకు హాజరుకావాలని వర్మకు పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. కానీ, ఈ రోజు విచారణకు వర్మ గైర్హాజరైన వైనం హాట్ టాపిక్ గా మారింది.
షూటింగ్ ఉన్న కారణంగా తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు వర్మ వాట్సాప్ మెసేజ్ పంపించడం చర్చనీయాంశమైంది. తాను విచారణకు రావడం లేదని ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ నేరుగా వాట్సాప్ మెసేజ్ చేశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న షూటింగ్ ల వల్లే ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తనకు వారం రోజులు పాటు గడువు ఇవ్వాలని వర్మ కోరారు.
ఈ క్రమంలోనే తన లాయర్ శ్రీనివాసరావు ద్వారా సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ విజ్ఞప్తి లేఖ పంపించారు. వర్మ విజ్ఞప్తిని పరిశీలించి స్పందిస్తామని పోలీసులు చెప్పారు. అంతకుముందు వర్మకు హైదరాబాద్ వెళ్లి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వర్మపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on November 19, 2024 5:04 pm
ఏపీలో 30 వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళల…
ఇండియన్ సినిమా బడ్జెట్లను, వసూళ్లను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. పదేళ్ల కిందటే ఈ సినిమా మీద రూ.250…
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) గత…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కడప దర్గాకు రావడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇక్కడికి సెలబ్రెటీస్…
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ అరెస్టు దేశ రాజకీయాలలో సైతం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.…