చైనా, పాకిస్దాన్ దుస్సాహసం..భారత్ కు ఇబ్బందులే

మనదేశాన్ని ఇబ్బందులు పెట్టటానికి డ్రాగన్, పాకిస్ధాన్ దేశాలు సంయుక్తంగా భారీ కుట్ర మొదలుపెట్టాయి. ఇండియా-చైనా-పాకిస్దాన్ మధ్య ఉన్న ఎవరికీ చెందని ప్రాంతం(నో మ్యాన్స్ ల్యాండ్) గిల్గిత్-బాల్టిస్ధాన్ ప్రాంతాన్ని పాకిస్ధాన్ లోని భూభాగంగా కలిపేసుకునేందుకు కుట్రలు మొదలయ్యాయి. వేలాది కిలోమీటర్లలో విస్తరించున్న ఈ ప్రాంతాన్ని విలీనం చేసుకోవటానికి పాకిస్ధాన్ లాంఛనంగా పనులు మొదలుపెట్టింది. ఇది జరిగితే మనదేశానికి ఇబ్బందులు తప్పవని కేంద్రప్రభుత్వంతో పాటు రక్షణ రంగంలోని నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం గిల్గిత్ –బాల్టిస్ధాన్(జీబీ) ప్రాంతం ఎవరికీ చెందని ప్రాంతంలో ఉంది కాబట్టి దశాబ్దాల తరబడడి స్వయంప్రతిపత్తితో కంటిన్యు అవుతోంది. నిజానాకి ఈ ప్రాంతాన్ని ఏ దేశం, ఏ రూపంలో కూడా ముట్టుకోకూడదు. వాస్తవం ఇదైతే ఈ ప్రాంతమంతా తమదే అని దాయాది దేశం ఎప్పటికప్పుడు ప్రకటనలు గుప్పిస్తునే ఉంది. అంతేకాంకుండా తమ సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ ప్రాంతమంతా తమదే అన్న పద్దతిలో విధానపరమైన మార్పులు చేస్తోంది. జీబీ ప్రాంతం మొత్త ఆసియా ఖండంలోనే మూడు దేశాలకు అత్యంత కీలకమైన ప్రాంతం.

మూడు అణ్వస్త్ర దేశాల భూభాగాలు కలిసే ప్రాంతమైన మధ్య ఆసియా, నైరుతి ఆసియా, దక్షిణాసియా తో పాటు అనేక ప్రాంతాలను జీబీ మార్గమే కలుపుతోంది. ఈ ప్రాంతం మిగిలిన రెండు దేశాలకన్నా చైనాకు చాలా చాలా అవసరం. చైనా ఏర్పాటు చేయబోతున్న సిల్క్ రూట్ తో పాటు ఎకనామికల్ క్యారిడార్ ఈ ప్రాంతంగుండానే ముందుకెళ్ళాలి. కానీ దానిపై డ్రాగన్ దేశానికి ఎటువంటి అథారిటి లేదు. అందుకనే వెనకనుండి పాకిస్ధాన్ ను ఉసిగొల్పుతోంది. ఒకసారి పాకిస్ధాన్ గనుక జీబీపై పూర్తి పట్టుసాధిస్తే అప్పుడు ఆ మొత్తం ప్రాంతాన్ని తాను గుప్పిట్లో ఉంచుకునేందుకు డ్రాగన్ కుట్రలు మొదలుపెట్టింది.

ఒకపుడు అంటే 1845-46 ప్రాంతంలో ఈ ప్రాంతం మొత్తాన్ని సిక్కులే పరిపాలించారు. అంటే చరిత్రను తీసుకున్నా, భౌగోళికంగా తీసుకున్నా అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం పై ప్రాంతం మనకు చెందిందే. కాకపోతే పై రెండు దేశాల కుట్రల ఫలితంగా చివరకు ఎవరికీ చెందని భూమిగా మారిపోయింది. దాయాది, డ్రాగన్ దేశాల కుట్రలు విజయవంతమతే మనదేశానికి చాలా ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ వ్యవహారాలు చూసే నిపుణులు ఆందోళన పడుతున్నారు. మరి దాయాది దేశం కుట్రను కేంద్రప్రభుత్వం ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాల్సిందే.