ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధానంగా మూడు విషయాలను ఆయన కేంద్ర మంత్రులతో చర్చించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతోనూ ఆయన భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఏపీలోనే చంద్రబాబు.. అనంతరం ఢిల్లీ వెళ్లి.. అక్కడ వారిని కలిశారు. ఈ క్రమంలో అమరావతి రాజధానికి సంబంధించిన కీలక విషయంపై జైశంకర్‌తో చర్చించారు.
అమరావతి రాజధానిని నిర్మించేందుకు, ఈ ఐదేళ్ల కాలంలోనే దానిని పూర్తి చేసేందుకు కూడా చంద్రబా బు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన నిధులు సమీకరిస్తున్నారు. మూడు మార్గాల్లో ఆయన అమరావతి కోసం సొమ్ములు సేకరిస్తున్నారు. ఇక, ఈ నిర్మాణాలు పూర్తి చేయాలంటే.. సింగపూర్ ప్రభు త్వంతో మరోసారి సంబంధాలు పెంచుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. గతంలోనే సింగపూర్ తో సంబంధాలు కొనసాగించారు.
అయితే.. వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. దీంతో సింగపూర్ ఒప్పందం రద్దయిపో యింది. ఇప్పుడు దానిని పునరుద్ధరించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం సాయం చేయాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావించారు. దీనిపై కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. ఇక, మరో కీలకమైన విషయం పోలవరం జలాలను సీమ ప్రాంతాలకు తరలించడం.
దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. గోదావ రి-పెన్నా నదులను అనుసంధానించడం ద్వారా.. సీమ జిల్లాలకు నీళ్లు ఇస్తామని.. దీనికి సంబంధించి 60 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. సాయం చేయాలని ఆయన కోరారు. ఇక, మూడో కీలకమైన అంశం… రాష్ట్రంలో విధిస్తున్న జీఎస్టీలో ఏపీకి చెందిన పన్నులలో 1 శాతం అదనంగా సర్ చార్జీని విధించాలని కోరడం. ఇది కూడా రాష్ట్రానికి అత్యంత కీలకమైన విషయం. దీనికి కనుక కేంద్రం ఓకే చెబితే..వ చ్చే రెండేళ్లపాటు.. జీఎస్టీ ఆదాయంలో 1 శాతం మేరకు రాష్ట్రానికి అదనంగా పన్నులు సమకూరుతాయి. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.