వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. ఈ విషయం ఇటు సాధారణ ప్రజల్లోనూ.. అటు మేధావుల్లోనూ కూడా చర్చకు దారితీస్తోంది. ఇదేసమయంలో కొందరు సోషల్ మీడియాల్లోనూ పోస్టులు పెడుతున్నారు. ఇక, జగన్ సోదరి షర్మిల అయితే.. నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత.. ఇంటికి పరిమితం కావడం ఏంటి? అని కూడా చర్చిస్తున్నారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఒకరకంగా ఇరుకున పడుతోందనే చెప్పాలి. మరో నాలుగేళ్లకు పైగానే ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి.. వైసీపీ ప్రతిపక్షంగా నే కొనసాగుతుంది. పోనీ.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ హైకోర్టుకువెళ్లినా.. ఆ కేసు ఎప్పుడు తేలుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు హైకోర్టు వైసీపీకి సానుకూలంగా తీర్పు ఇచ్చినా.. స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలు ఉంటుంది.
కాబట్టి.. వైసీపీకి వచ్చే ఏడాది వరకు కూడా ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరోవైపు వైసీపీ సభ్యులపై వేటు వేయాలన్నది మేధావుల నుంచి వస్తున్న సూచన. సభ్యుల మాట ఎలా ఉన్నా.. జగన్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయిపోవాలన్నది కూడా వారి మాట. దీనికి సంబంధించి కొందరు మేధావులు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సమాచారం ఇచ్చారు. దీనిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 190ని వారు ప్రస్తావిస్తున్నారు.
ఈ ఆర్టికల్ ప్రకారం.. సభ కనుక వరుసగా 60 రోజులు జరిగితే.. ఆ సమావేశాలకు కనుక ఎవరైనా ఎమ్మెల్యే హాజరు కాకపోతే.. సదరు అభ్యర్థి సభ్యత్వం ఆటోమేటిక్‌గానే రద్దవుతుంది. ఈ విషయాన్ని మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు స్పీకర్‌కు రాసిన ఉత్తరంలో పేర్కొన్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న దీనిపై దృష్టి పెట్టారు. అంటే.. సభను వరుసగా 60 రోజులు నిర్వహించి.. (మధ్యలో ఆదివారాలు.. ఒకటి రెండు రోజులు సెలవు ఇవ్వొచ్చు) సభకు రావాలని జగన్‌ను కోరే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆయన రాకపోతే.. ఆటోమేటిక్‌గానే ఆయన సభ్యత్వం రద్దు చేయాలన్నది ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 18, 2024 1:42 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…